• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Taapsee Pannu Secret Wedding: తాప్సీ పెళ్లి ఫోటోలు ఎందుకు షేర్ చేయలేదు.. సీక్రెట్ వెడ్డింగ్‌పై హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Taapsee Pannu Secret Wedding: తాప్సీ పెళ్లి ఫోటోలు ఎందుకు షేర్ చేయలేదు.. సీక్రెట్ వెడ్డింగ్‌పై హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Written ByVishnu Priya
Published: Sep 28, 2026, 01:08 PM IST|Updated: Sep 28, 2026, 01:14 PM IST
joinshare

Taapsee Pannu Secret Wedding: తాప్సీ పన్ను తన పెళ్లిని ఎందుకు సీక్రెట్‌గా ఉంచారో తాజాగా వెల్లడించారు. మథియాస్ బోయ్‌తో వివాహం తర్వాత ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడానికి గల కారణాన్ని వివరించారు. అలాగే పెళ్లి వీడియో లీక్ కావడం, అతిథుల ఫోన్లపై ఆమె చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
 

Taapsee Pannu wedding1/5

తాప్సీ పన్ను లేటెస్ట్ న్యూస్

సినీ తారల పెళ్లి అంటే అభిమానుల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే హీరోయిన్ తాప్సీ పన్ను మాత్రం తన వివాహాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచుకున్నారు. డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోయ్‌ను తాప్సీ ఉదయ్‌పూర్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పెద్దగా పంచుకోలేదు.
 Mathias Boe Taapsee Pannu2/5

మథియాస్ బోయ్ తాప్సీ పన్ను

యూట్యూబ్ ఇంటర్వ్యూలో భాగంగా తాప్సీ తన పెళ్లి గురించి, ఫోటోలు బయటకు రాకపోవడానికి గల కారణాల గురించి మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్‌ను ఎప్పుడూ వేర్వేరుగా చూస్తానని ఆమె చెప్పారు. పెళ్లిని రహస్యంగా ఉంచడం వెనుక ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు.
Taapsee Pannu privacy3/5

తాప్సీ పన్ను ప్రైవసీ

వివాహం అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని తాప్సీ పేర్కొన్నారు. పెళ్లి గురించి ప్రత్యేకంగా ప్రెస్ నోట్లు విడుదల చేయడం, ఫోటోలు, వీడియోలను ఆల్బమ్‌లుగా అందరికీ చూపించడం తనకు అంతగా నచ్చదని చెప్పారు. అందుకే పెళ్లిని సింపుల్‌గా, ప్రైవేట్‌గా జరుపుకున్నట్లు వివరించారు.
Taapsee Pannu wedding video leak4/5

తాప్సీ పన్ను పెళ్లి వీడియో లీక్

అయితే పెళ్లికి వచ్చిన కొందరు అతిథులు ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండాలని ముందుగానే కోరినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఒక వీడియో బయటకు రావడంతో తాప్సీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పెళ్లికి వచ్చిన వారి ఫోన్లను తీసుకోవడం సరైన పద్ధతి కాదని తాప్సీ అభిప్రాయపడ్డారు. అతిథులను నమ్మి, చిన్న విజ్ఞప్తి చేస్తే వారు దానిని గౌరవిస్తారని భావించానని చెప్పారు. కానీ వీడియో బయటకు రావడం తనకు ఇబ్బందిగా అనిపించిందని తెలిపారు.
Taapsee Pannu interview5/5

తాప్సీ పన్ను ఇంటర్వ్యూ

తన భర్త మథియాస్ బోయ్ క్రీడా రంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన ప్రైవసీని కూడా కాపాడాలని తాప్సీ భావించారు. సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై మీడియా, అభిమానుల్లో ఎక్కువ ఆసక్తి ఉంటుందని, అదే తరహా దృష్టి తన భర్తపై పడటం తనకు ఇష్టం లేదని ఆమె వివరించారు.
TAGS:
Bollywood
Tollywood
Telugu News
Telugu Movie

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.