తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో వివిధ రకాల వాహనాలపై శ్రీవారు మాడవీధుల్లో తిరుగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ ఉత్సవాల ముగింపు ఘట్టాన్ని సంబంధించిన ఫోటోలు ఇప్పుడు చూద్దాం.
1/8
తిరుమల
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం ఉదయం చక్రస్నానాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.
2/8
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు
సుదర్శన చక్రం, చక్రత్తాళ్వార్లకు స్వామివారి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించి, వేలాది మంది భక్తులు పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు స్వామివారికి పల్లకి ఉత్సవం నిర్వహించారు.
3/8
శ్రీవారి చక్రస్నానం
అనంతరం ఉదయం 6 నుండి 8:30 గంటల వరకు శ్రీ భూవరాహ స్వామి వారి ఆలయ ముఖమంటపంలో శ్రీదేవి, భూదేవి సమేతమయ్యప్ప స్వామి వారి సుదర్శన చక్రం, చక్రత్తాళ్వార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
4/8
తిరుమల తిరుపతి దేవస్థానం
ఈ క్రమంలో పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, గంధం, పసుపుతో స్వామివారికి అభిషేకం చేశారు. కుంభధారణలను ఉపయోగించి, టీటీడీ వేద పారాయణ దారుల పర్యవేక్షణలో ఉపనిషత్తులు, దశ శాంతి మంత్రాలు ఇతర వేదమంత్రాలను పఠించారు.
5/8
తిరుమల లేటెస్ట్ న్యూస్
లోక క్షేమం కోసం ఈ పవిత్ర అవభృథ స్నానం నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం అనేది సంపూర్ణతను చేకూర్చే అత్యంత పవిత్రమైన ఘట్టం. లోకమంతా సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండాలని, సకల జీవరాశులకు శుభం కలగాలని కోరుతూ ఈ స్నానాన్ని నిర్వహిస్తారు.
6/8
టీటీడీ
తిరుమల బ్రహ్మోత్సవాలను ఒక మహా యజ్ఞంతో సమానంగా భావిస్తారు. అవభృథ స్నానం వలెనే బ్రహ్మోత్సవాల ముగింపులో చక్రస్నానం నిర్వహించడం ఇక్కడి సాంప్రదాయం. ఈ దివ్య ఘట్టాన్ని దర్శించుకోవడానికి బ్రహ్మోత్సవాల సమయంలో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకున్నారు.
7/8
తిరుమల రద్దీ
వేద మంత్రాల సాక్షిగా జరిగిన చక్రస్నానంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దిగ్విజయం కాగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు శ్రీవారి వివిధ వాహన సేవలు భక్తులకు కనువిందు చేశాయి. ముఖ్యంగా గరుడ వాహన సేవ, స్వర్ణ రథోత్సవం రోజుల్లో భక్తుల రద్దీ భారీగా ఉంది.
8/8
తిరుమల భక్తులు
తిరుమల భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల ముగింపుతో తిరుమలలో భక్తుల కోలాహలం కొనసాగుతోంది.