• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /నవంబర్ 30న తిరుపతిలో మహాద్భుతం.. వందలాది మహిళలతో సామూహిక లక్ష్మీ నీరాజనం.. ఎక్కడ చూడాలంటే?

నవంబర్ 30న తిరుపతిలో మహాద్భుతం.. వందలాది మహిళలతో సామూహిక లక్ష్మీ నీరాజనం.. ఎక్కడ చూడాలంటే?

Written ByRenuka Godugu
Published: Nov 24, 2026, 08:34 IST|Updated: Nov 24, 2026, 08:39 IST
joinshare

తిరుమలలో ఈరోజు కార్తీక మహా దీపోత్సవం జరగనుంది. ఇదే నెలలో నవంబర్ 30వ తేదీన తిరుపతిలో కూడా వైభవంగా కార్తీక మహా దీపోత్సవం నిర్వహిస్తున్నారు. భక్తితో విశేష పూజలు చేస్తూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలతో సామూహిక లక్ష్మీ నీరాజనం కూడా జరిపిస్తారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Tirumala Tirupati Devasthanam1/5

తిరుమల తిరుపతి దేవస్థానం

పవిత్ర కార్తీక మాసంలో తిరుమలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది, భక్తుల తాకిడి కూడా పెరిగింది. తిరుమలలో ఈరోజు కార్తీక దీపం నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలోని పౌర్ణమి రోజు సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. నవంబర్ 30వ తేదీన తిరుపతిలో కూడా వైభవంగా కార్తీక మహా దీపోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
karthika maha deepotsavam 2/5

తిరుపతి కార్తీక మహాదీపోత్సవం

భక్తిప్రపత్తులతో విశేష పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. వందలాది మంది మహిళలతో సామూహిక లక్ష్మీ నీరాజనం కూడా సమర్పిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం కూడా ఉంటుంది.
ttd news3/5

టీటీడీ వార్తలు

ఈ కార్తీక మహా దీపోత్సవం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవన ప్రాంగణంలో ఉన్న పరేడ్ మైదానంలో జరుగుతుంది. నవంబర్ 30వ తేదీ, సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల నుంచి రాత్రి 8:45 గంటల వరకు ఈ విశేష పూజలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి.
lakshmi neerajanam tirupati4/5

సామూహిక లక్ష్మీ నీరాజనం

మహా దీపోత్సవం సందర్భంగా దీపప్రజ్వలన విశిష్టతను చాటేలా శ్రీనివాస అర్చన, విష్ణు సహస్రనామ స్తోత్రం, మహాలక్ష్మి పూజ నిర్వహిస్తారు. అష్టలక్ష్మి వైభవం, ఇతర నృత్య ప్రదర్శనలు కూడా ఉంటాయి.
tirupati karthika deepotsavam5/5

కార్తీక మాసం పూజలు

కార్తీక మహా దీపోత్సవం సందర్భంగా వందలాది మంది మహిళలు సామూహికంగా దీపాలు వెలిగించి మహాలక్ష్మి అమ్మవారికి లక్ష్మీ నీరాజనం సమర్పిస్తారు. వేంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి అమ్మవారి దివ్య అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తారు.
TAGS:
Tirumala
Tirupathi
Spirituality
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
సల్మాన్ ఫ్లాప్స్ పరంపరకు ‘మాతృభూమి’ చెక్ పెడుతుందా..!!

సల్మాన్ ఫ్లాప్స్ పరంపరకు ‘మాతృభూమి’ చెక్ పెడుతుందా..!!

2

సినిమాలకు కియారా అద్వానీ బై బై.. ? క్లారిటీ ఇచ్చిన ‘టాక్సిక్’ భామ..!!

3

కోలీవుడ్‌కు కలిసొచ్చిన 2027.. జైలర్ 2, వీరభద్రుడు, సీన్ సహా భారీ హిట్లు..

4

Ansal API: కోరమ్‌ లేక అన్సల్ ఏపీఐ ప్రమోటర్ల ఈజీఎం రద్దు.. తెరపైకి ఈ- ఓటింగ్ వివాదం

5

సనాతన ధర్మ పరిరక్షణ అంటే పురాతన దేవాలయాలను కూల్చివేయడమేనా? వైఎస్ జగన్..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.