Abhishek Sharma SRH Exit News: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్ నుంచి సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఎస్‌ఆర్‌హెచ్‌ను వీడే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది. 2027 బిజీ షెడ్యూల్ కారణంగా పాట్ కమిన్స్ అందుబాటులో ఉండకపోవచ్చని భావిస్తున్న యాజమాన్యం.. కెప్టెన్సీ బాధ్యతలను వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు అప్పగించేందుకు మొగ్గు చూపుతోంది. అయితే 2019 నుంచి జట్టుతో కొనసాగుతూ కెప్టెన్సీపై ఆశలు పెట్టుకున్న అభిషేక్ శర్మ.. ఈ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో కూడా కమిన్స్ టీమ్‌తో చేరే వరకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అప్పటి నుంచే అభిషేక్ టీమ్ మేనేజ్‌మెంట్‌పై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో వచ్చే సీజన్‌కు ముందే టీమ్ మారాలని నిర్ణయం ఇంచుకున్నట్లు TOI వెల్లడించింది.
ఇప్పటికే పలు ఫ్రాంచైజీలతో అనధికారికంగా ప్రాథమిక చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలతో చర్చించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా అభిషేక్ శర్మ మెంటార్ యువరాజ్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో సంబంధం కలిగి ఉన్నందున.. ఆ ఫ్రాంచైజీ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇతర జట్లలో కెప్టెన్సీ ఖాళీలు పెద్దగా లేకపోయినా.. కేవలం సాధారణ ఆటగాడిగానైనా సరే సన్‌రైజర్స్ క్యాంప్ నుంచి బయటకు రావాలని అభిషేక్ శర్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం టీ20ల్లో వరల్డ్ నంబర్-2 బ్యాటర్‌గా ఉన్న అభిషేక్ శర్మను టీమ్ నుంచి రిలీజ్ చేసేందుకు సన్‌రైజర్స్ అంత ఈజీగా ఒప్పుకునే అవకాశాలు లేవు. జట్టు మారాలంటే భారీ క్యాష్ డీల్ లేదా ఓ బిగ్ ప్లేయర్ ట్రేడ్ జరగాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యవహారంపై వస్తున్న వార్తలను ఎస్‌ఆర్‌హెచ్ సీఈవో కె.షణ్ముగం ఖండించారు. వీటిలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అటు అభిషేక్ సన్నిహిత వర్గాలు కూడా ప్రస్తుతం ఏమీ జరగడం లేదని చెబుతున్నా.. ఐపీఎల్ వర్గాలు మాత్రం SRH క్యాంప్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. డిసెంబర్‌లో జరగబోయే మినీ వేలానికి ముందే తమ స్టార్ ప్లేయర్‌ను ఎస్‌ఆర్‌హెచ్ బుజ్జగించి ఆపుకుంటుందా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.