SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Asian Games 2026: టీ20ల్లో భారత జట్టు నయా వరల్డ్ రికార్డు..ఒక్క గెలుపుతో ప్రపంచంలోనే ఏకైక జట్టుగా ఎదిగిన టీమ్ఇండియా!

Asian Games 2026 Team India Record: ఆసియా క్రీడలు 2026ల్లో భారత క్రికెట్ జట్టు ఇప్పటికే ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. నేడు జరిగిన సెమీఫైనల్‌లో శ్రీలంకపై 124 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది. అయితే ఈ గెలుపుతో టీ20ల్లో 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా టీమ్ఇండియా సరికొత్త రికార్డును సాధించింది.

Written By Harish Darla
Published: Oct 01, 2026, 04:26 PM IST | Updated: Oct 01, 2026, 04:39 PM IST
Join

Asian Games 2026 Team India Record: జపాన్ వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడలు 2026 పోటీల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సరికొత్త రికార్డును ఆవిష్కరించింది. శ్రీలంకతో జరిగిన కీలక సెమీఫైనల్లో 124 పరుగుల తేడాతో విజయం సాధించి, మరో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఆ వెంటనే 170 పరుగుల లక్ష్యంగా బరిలో దిగిన శ్రీలంక జట్టు అనూహ్యంగా బోల్తా కొట్టింది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు నిలదొక్కుకోలేక ఆది నుంచి వరుస వికెట్లను సమర్పించుకున్నారు. అయితే కేవలం 9.5 ఓవరల్లోనే శ్రీలంక 45 పరుగులకే కుప్పకూలిపోయింది.

టీ20 క్రికెట్‌లో భారత్ ప్రపంచ రికార్డు శ్రీలంకపై సాధించిన ఈ విజయంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ సరికొత్త రికార్డును సాధించింది. పురుషుల టీ20ల్లో 100 లేదా అంతకంటే ఎక్కువ రన్స్ తేడాతో అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా నిలిచింది. టీమ్ఇండియా ఇప్పటివరకు 11 సార్లు 100కు పైగా పరుగుల తేడాతో విజయాలను సాధించి, ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. ఈ జాబితాలో 10 విజయాలతో కెనడా రెండో స్థానంలో ఉండగా.. అయితే ఆసియా గేమ్స్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత్ కూడా కెనడాతో సమానంగా నిలిచింది. ఆ తర్వాత మూడో స్థానంలో ఆస్ట్రేలియా జట్టు 9 విజయాలతో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుత విజయంతో భారత్ కెనడాను వెనక్కినెట్టి ఏకైక జట్టుగా అగ్రస్థానానికి చేరుకుంది.

నాకౌట్ మ్యాచ్‌లలో ఆధిపత్యానికి ఈ మ్యాచ్ మరో అరుదైన రికార్డుకు వేదికైంది. ఐసీసీ పూర్తి సభ్యత్వం కలిగిన దేశాల మధ్య టీ20 టోర్నీ‌ సెమీఫైనల్ లేదా ఫైనల్‌లో నమోదైన అత్యధిక పరుగుల విజయ మార్జిన్ ఇదే కావడం విశేషం. భారత్ 124 పరుగుల విజయంలో తన పాత రికార్డును దాటింది. గతంలో 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై సాధించిన 96 పరుగుల విజయమే అత్యుత్తమంగా నిలిచింది. ఇప్పుడు ఆసియా గేమ్స్ సెమీఫైనల్లో శ్రీలంకపై గెలుపుతో ఆ రికార్డును టీమ్ఇండియా తిరగరాసింది.

సెమీఫైనల్లో గెలుపుతో భారత పురుషుల క్రికెట్ జట్టు ఇప్పుడు ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్ జట్టుతో బంగారు పతకం కోసం పోటీ పడనుంది. గతంలో జరిగిన ఆసియా క్రీడల్లో గెలిచిన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకునేందుకు టీమ్ఇండియా దృఢ సంకల్పంతో ఉండగా.. ఫైనల్‌లో పాకిస్థాన్ జట్టును చిత్తుచేసి మరోసారి పసిడి పతకాన్ని ముద్దాడాలని చూస్తోంది.

Also Read: Asian Games 2026: ఆర్సీబీ టీమ్ రికార్డు బ్రేక్ చేసిన శ్రీలంక..కేవలం 45 పరుగులకే ఆలౌట్..ఫైనల్‌కు టీమ్ఇండియా!

Also Read: Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో భారత్ విజయభేరి..ఒకే రోజు ఆర్చరీలో 3 బంగారు పతకాలు..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES