IPL 2027: ఐపీఎల్ 2027లో కీలక పరిణామం.. ప్లేయర్లను ఇచ్చిపుచ్చుకున్న చెన్నై, హైదరాబాద్
CSK And SRH Exchanges Four Players Know The Who: క్రీడా రంగంలో అత్యంత రసవత్తరమైన ఫ్రాంచైజీ టోర్నమెంట్ ఐపీఎల్ 2027పై భారీ ఆసక్తి నెలకొంది. కొత్త సీజన్‌కు సమయం దగ్గరపడుతుండడంతో వేలంపై ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో నలుగురు ప్లేయర్లు ఒక జట్టు నుంచి మరో జట్టులోకి స్థాన చలనం అయ్యారు.
TATA IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్త సీజన్‌కు సంబంధించి వేలం పాటకు సమయం సమీపిస్తుండడంతో ఫ్రాంచైజీ జట్లు ప్లేయర్లను వదులుకోవడం.. కొత్త వారిని తీసుకోవడం వంటివి చేస్తున్నాయి. సత్తా చాటలేని ఆటగాళ్లను వదులేసుకుని.. క్రికెట్‌లో రాణిస్తున్న ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ జట్టులోని ప్లేయర్లను ఇచ్చి పుచ్చుకున్నాయి. ఇద్దరు చొప్పున ఆటగాళ్లను చెన్నై.. హైదరాబాద్ జట్లు మార్చేసుకున్నాయి. ఈ మేరకు ఒప్పందం చేసుకున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ జట్ల మధ్య నలుగురు ఆటగాళ్ల ట్రేడ్ పూర్తి అయింది. టాటా ఐపీఎల్ 2027కు ముందు ఈ కీలక మార్పిడి జరిగిందని ఇరు సంస్థలు ప్రకటించాయి.
చెన్నైలో చేరిన ఆటగాళ్లు
లియామ్ లివింగ్‌స్టన్, జాక్ ఎడ్వర్డ్స్
హైదరాబాద్‌లో చేరిన ఆటగాళ్లు
ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్
భారీ తక్కువ ధరకు స్టార్ క్రికెటర్
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ సన్‌రైజర్స్‌లో రూ.13 కోట్లకు వేలం పలికిన ధరను భారీగా తగ్గించుకుని చెన్నై జట్టులోకి రూ.6 కోట్లకు వెళ్లాడు. హైదరాబాద్ ఫ్రాంచైజీ గత వేలంలో లివింగ్‌స్టోన్‌కు రూ.13 కోట్లు వెచ్చించింది. అయితే ఇప్పుడు రూ.7 కోట్లకు తగ్గి మరి చెన్నై జట్టులో చేరిపోయాడు. ఇక ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్ రూ.3 కోట్ల ధరతో చెన్నైకి అమ్ముడుపోయాడు. వీరిద్దరికి బదులుగా సీఎస్‌కే తన పేస్ బౌలర్లు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌ను హైదరాబాద్‌కు ఇచ్చేసింది.
బౌలర్లను తీసుకున్న సన్‌రైజర్స్
బౌలింగ్ కొరతతో బాధపడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ తన బౌలింగ్ దళంలోకి చెన్నై పేసర్లను ఆహ్వానించింది. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన ఖలీల్ అహ్మద్ రూ. 4.8 కోట్ల ధరతో తిరిగి సన్‌రైజర్స్ జట్టుకు వచ్చాడు. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ నాథన్ ఎల్లిస్ రూ.2 కోట్ల ధరకు హైదరాబాద్ జట్టులో చేరిపోయాడు.
వేలానికి భారీ వ్యూహం
ఇరు జట్లు ఆటగాళ్లను ఇచ్చిపుచ్చుకోవడంతో ఐపీఎల్ 2027 వేలం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలు జట్లు తమ హెడ్ కోచ్‌లతోపాటు ఇతర కోచ్‌లను మార్చుకోగా.. ప్లేయర్లను కూడా వదిలేసుకున్నాయి. వేలానికి సమయం సమీపిస్తుండడంతో జట్టు కూర్పుపై జట్లు దృష్టి సారించాయి. ఈసారి ట్రోఫీ లక్ష్యంగా ఫ్రాంచైజీలు తమ జట్టు కూర్పుపై భారీ ప్రణాళిక రూపొందిస్తున్నాయి. వచ్చే నెలలో గోవాలో జరగనున్న వేలానికి ఫ్రాంచైజీలు భారీ వ్యూహంతో సిద్ధమయ్యాయి.