• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Hardik Pandya IPL Trade: ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్‌బై?! మాజీ కెప్టెన్‌ కోసం రేసులో 5 జట్లు!

Hardik Pandya IPL Trade: ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్‌బై?! మాజీ కెప్టెన్‌ కోసం రేసులో 5 జట్లు!

Hardik Pandya IPL 2027 Trade: గతేడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు వైఫల్యం వెనుక కెప్టెన్ హార్దిక్ పాండ్యా కారణమని అనేక సార్లు బాహాటంగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను ఇప్పటికే ముంబై జట్టు వదిలేసినట్లు తెలుస్తోంది. అయితే రాబోయే 2027 సీజన్ కోసం హార్దిక్ పాండ్యా కోసం పోటీలో ఉన్న ఐపీఎల్ టీమ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByHarish Darla
Published: Nov 01, 2026, 06:44 AM IST|Updated: Nov 01, 2026, 06:45 AM IST
joinshare
Hardik Pandya IPL Trade: ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్‌బై?! మాజీ కెప్టెన్‌ కోసం రేసులో 5 జట్లు!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AP Municipal Elections: ఓటరు చిటీ ఉందా..?.. కేజీ చికెన్ ఫ్రీ.. ఏపీలో లోకల్ దంగల్ వేళ బంపర్ ఆఫర్..

AP Municipal Elections: ఓటరు చిటీ ఉందా..?.. కేజీ చికెన్ ఫ్రీ.. ఏపీలో లోకల్ దంగల్ వేళ బంపర్ ఆఫర్..

2

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి!

3

తెలంగాణలో కరువు తీరా కుమ్మేస్తోన్న వర్షం..

4

తుపానుగా వాయుగుండం.. APకి మరో ముప్పు..

5

Katrina Kaif Body Shaming: హీరోయిన్ కత్రినా కైఫ్ బాడీ షేమింగ్..ట్రోలర్స్‌కు ఇచ్చి పడేసిన బాలీవుడ్ బ్యూటీ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Hardik Pandya IPL 2027 Trade: ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు గత ఆరు సీజన్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఎంతోమంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నప్పటికీ 2026 సీజన్‌లో కేవలం నాలుగు మ్యాచుల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పరిమితమైంది. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యూహాలు ఫలించకపోవడం, వ్యక్తిగత ప్రదర్శన తగ్గడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

దీనికితోడు డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్ ఆటగాళ్ల నుంచి మద్దతు కొరవడటం, అభిమానుల వ్యతిరేకతతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన పాండ్యా, స్వయంగా ముంబై జట్టును వీడాలని మేనేజ్‌మెంట్‌కు తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ వంటి ఐదు ప్రధాన జట్లు అతనిని దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి.

హార్దిక్ పాండ్యా గతంలో 2015 నుండి 2021 వరకు ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. అనంతరం 2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా మారి ఆ జట్టుకు టైటిల్ అందించాడు. 2023లో రన్నరప్‌గా నిలిపాక, 2024లో తిరిగి ముంబై జట్టులోకి వచ్చి మూడు సీజన్లు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే అతని నాయకత్వంలో జట్టు గ్రాఫ్ పడిపోవడంతో కెప్టెన్సీ మార్పు అవసరమని విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఒకవేళ పాండ్యా ముంబైని వీడితే చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు అతనిపై ఆసక్తి చూపిస్తున్నాయని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపారు. ముఖ్యంగా కేకేఆర్ (KKR) జట్టులో హార్దిక్‌కు కెప్టెన్సీ దక్కే అవకాశం ఉందని, ఈ ట్రేడింగ్ ఒప్పందంలో భాగంగా హర్షిత్ రాణా లేదా రింకూ సింగ్‌ను ముంబైకి ఇచ్చే అవకాశం ఉందని అశ్విన్ పేర్కొన్నారు. ఒకవేళ గుజరాత్ టైటాన్స్‌లోకి పాండ్యా తిరిగి వెళ్తే, రషీద్ ఖాన్ ముంబై జట్టుకు మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరోవైపు, ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్దిక్‌ను ఆటగాడిగా కొనసాగిస్తూ కేవలం కెప్టెన్సీ బాధ్యతల నుండి మాత్రమే తప్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ ఆల్‌రౌండ్ నైపుణ్యాల వల్ల అతడిని పూర్తిగా వదులుకోవడం సులభం కాదని నిపుణులు భావిస్తున్నారు. కెప్టెన్సీ నుంచి తప్పిస్తే జట్టు బాధ్యతలు జస్‌ప్రీత్ బుమ్రా లేదా తిలక్ వర్మకు అప్పగించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు దగ్గరపడుతుండటంతో పాండ్యా భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News
Cricket
IPL
Telugu News