ICC 2027 World Cup Schedule: 2027 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ అధికారికంగా విడుదల అయ్యింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు ప్రపంచ కప్ ఆతిథ్య బాధ్యతలు దక్కడం విశేషం. గతంలో ఈ రెండు దేశాలు 2003లో వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చారు. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలవగా.. టీమ్ఇండియా రన్నరప్‌లో నిలిచింది. అయితే ఆఫ్రికా ఖండానికి సంబంధించిన నమీబియా క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ప్రపంచకప్ మ్యాచ్‌లను ఆతిథ్యమివ్వబోతోంది. ఈ సుదీర్ఘ టోర్నమెంట్ 2027 అక్టోబరు 2 నుంచి 2027 నవంబరు 21 వరకు ఈ టోర్నీ జరగనుంది. అక్టోబరు 10న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య హై-వోల్డేజ్ మ్యాచ్ జరగనుంది.
టోర్నీ కొత్త ఫార్మాట్ విధానం..
ఈ టోర్నమెంట్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. సెమీ-ఫైనల్స్‌కు చేరుకోవడానికి ముందు జట్లు మూడు విభిన్న దశలలో పోటీపడాల్సి ఉంటుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అత్యల్పంగా ఉన్న మూడు జట్ల మధ్య 'సూపర్ సిరీస్' రౌండ్ జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది. అందులో అగ్రస్థానంలో నిలిచిన ఒక జట్టు, మిగిలిన 11 ప్రధాన జట్లతో కలిసి రెండవ రౌండ్‌లోకి ప్రవేశిస్తుంది. రెండవ దశలో 12 జట్లను రెండు గ్రూపులుగా (ప్రతి గ్రూప్‌లో 6 జట్లు) విభజించారు. ఈ గ్రూప్ దశ నుంచి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 7 జట్లు మూడో రౌండ్ నుంచి 'సూపర్ సెవెన్' రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ సెవెన్ పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు టోర్నీ సెమీఫైనల్‌కు చేరుతాయి. ఆ తర్వాత సెమీఫైనల్ విజేతలు ఫైనల్‌లో తలపడనున్నాయి.
టీమ్స్ అర్హత, మ్యాచ్‌ల సమాచారం..
మొత్తం 14 స్థానాల్లో 10 జట్లు ఇప్పటికే తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలతో పాటు, 2026 సెప్టెంబర్ 30 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు నేరుగా అర్హత సాధించాయి.
మిగిలిన 4 స్థానాలను భర్తీ చేయడానికి 2027 ఫిబ్రవరి, మార్చి నెలల్లో క్వాలిఫైయర్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌తో పాటు ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, USA జట్లు క్వాలిఫైయర్లలో పోటీపడటం ఖాయమైంది. ప్రధాన దశలోని జట్లు ఛాంపియన్‌గా నిలవాలంటే గ్రూప్ దశలో 5, సూపర్ సెవెన్‌లో 6, సెమీ-ఫైనల్, ఫైనల్‌లతో కలిపి సుదీర్ఘంగా 13 మ్యాచ్‌లు ఆడాలి. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ పోరుపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి, భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే 2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల క్రమంలో గ్రూప్స్‌ను ఐసీసీ ప్రకటించింది.
𝙈𝘼𝙍𝙆 𝙔𝙊𝙐𝙍 𝘾𝘼𝙇𝙀𝙉𝘿𝘼𝙍𝙎 🗓️ The ICC Men’s #CWC27 fixtures have been unveiled 🏆 Access the ticket ballot 🎫 https://t.co/MSLEQzcObb https://t.co/dpTE4TEjO7
— ICC (@ICC) October 1, 2026
గ్రూప్ - ఏ
ఆఫ్ఘనిస్థాన్
ఆస్ట్రేలియా
ఇండియా
పాకిస్థాన్
జింబాబ్వే
క్వాలిఫైయర్ - Aలో గెలిచిన జట్టు
గ్రూప్ - బీ
బంగ్లాదేశ్
ఇంగ్లాండ్
దక్షిణాఫ్రికా
శ్రీలంక
న్యూజిలాండ్
క్వాలిఫైయర్ - బిలో గెలిచిన జట్టు.
Also Read: Asian Games 2026: టీ20ల్లో భారత జట్టు నయా వరల్డ్ రికార్డు..ఒక్క గెలుపుతో ప్రపంచంలోనే ఏకైక జట్టుగా ఎదిగిన టీమ్ఇండియా!
Also REad: Asian Games 2026: ఆర్సీబీ టీమ్ రికార్డు బ్రేక్ చేసిన శ్రీలంక..కేవలం 45 పరుగులకే ఆలౌట్..ఫైనల్‌కు టీమ్ఇండియా!