RCB: వేలంలో బెంగళూరు జట్టు భారీ వ్యూహం.. వదులుకునే 7 మంది ఆటగాళ్లు వీరే?
RCB Likely 7 Players Will Be Releave From Team: ఐపీఎల్ 2027 సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) భారీ వ్యూహం సిద్ధం చేసుకుంది. జట్టులో భారీ ప్రక్షాళన జరగనున్నట్లు సమాచారం. జట్టులో కీలక మార్పులు చేసి మొత్తం ఏడుగురు ఆటగాళ్లను మార్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. జట్టు ప్రణాళిక ఎలా ఉందో తెలుసుకుందాం.
RCB Big Plan For IPL Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వరుసగా రెండు సార్లు చాంపియన్‌గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హ్యాట్రిక్‌గా ట్రోఫీ సాధించాలని భారీ వ్యూహం రచిస్తోంది. రాబోయే ఐపీఎల్ సీజన్లలో ఆధిపత్యం చెలాయించి మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకోవాలని సన్నాహాలు చేస్తోంది. 2027 సీజన్‌కు ముందే జట్టును పునర్నిర్మించాలని ఆ జట్టు యాజమాన్యం భావిస్తోంది. ప్రదర్శన.. సత్తా చాటలేకపోతున్న ఆటగాళ్లను వదులుకుని.. కొత్త ఆటగాళ్లను తీసుకోవాలని జట్టు ప్రణాళికలు వేస్తోంది. దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని ఆర్సీబీ యోచిస్తోంది.
7 మంది ఆటగాళ్ల విడుదల
ఆర్సీబీకి వికెట్ కీపర్ సమస్య ఉంది. వికెట్ కీపర్ స్థానంలో ఫిలిప్ సాల్ట్ ఉండగా.. రెండో వికెట్ కీపర్‌గా ఉన్న జితేష్ శర్మను వదులుకునే అవకాశాలు ఉన్నాయి. అతడిని మార్చాలని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. జట్టులో టిమ్ డేవిడ్ ఉండటంతో రొమారియో షెపర్డ్ స్థానం కూడా మారే అవకాశాలు లేకపోలేదు. ఇక బౌలింగ్ దళం విషయానికి వస్తే ఫాస్ట్ బౌలర్లు అభినందన్ సింగ్, కనిష్ చౌహాన్ ఫ్రాంచైజీ వదులుకునే అవకాశ ఉంది. బ్యాటింగ్ విషయంలో ఆల్ రౌండర్లు విహాన్ మల్హోత్రా, విక్కీ ఓద్వాల్, చాద్విక్ దేశ్‌వాల్‌లను కూడా జట్టు నుంచి విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వారిని వదులుకుని దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లతో వీరికి బదులుగా భర్తీ చేయాలని ఆర్సీబీ భావిస్తోంది.
తదుపరి సీజన్ కోసం ఆర్సీబీ భారీ ప్రణాళికలు వేసుకోగా.. ఈ ఏడాది చివరలో గోవాలో జరగనున్న వేలంపై సరికొత్త ప్రణాళికలు రచించింది. ఆటగాళ్ల మార్పిడితో కొన్ని కీలక స్థానాలను భర్తీ చేసుకోవాలని ఆర్‌సీబీ భావిస్తోంది. ఫిలిప్ సాల్ట్‌కు ప్రత్యామ్నాయంగా కాకుండా బ్యాకప్‌గా ఆడే భారతీయ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేసుకోవాలని చూస్తోంది. దీనికోసం యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఇక ఫాస్ట్ బౌలింగ్‌లో రాణించే ఆల్ రౌండర్‌ను జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రొమారియో షెపర్డ్‌కు బదులుగా వెస్టిండీస్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. స్పిన్ బౌలింగ్ విభాగంలో సుయాశ్ శర్మకు బ్యాకప్‌గా మరో పూర్తి స్థాయి స్పిన్నర్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. టిమ్ డేవిడ్ స్థానంలో ఫినిషర్ భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ స్థానాల్లో మరో ఫాస్ట్ బౌలర్ అవసరం జట్టుకు ఉంది.
తదుపరి కెప్టెన్ ఎవరు?
ఆర్సీబీకి రెండు సార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్ రజత్ పాటిదార్ తదుపరి సీజన్‌లో కెప్టెన్‌గా లేకపోవచ్చు. జట్టును నడిపిస్తున్నప్పటికీ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ కొత్త ప్లాన్ వేస్తోంది. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తదుపరి కెప్టెన్‌ను తీర్చిదిద్దే పనిలో ఉంది. ఈ క్రమంలో దేవదత్ పడిక్కల్‌ను జట్టు యాజమాన్యం పరిశీలిస్తోంది. ఇక విరాట్ కోహ్లీ జట్టును వీడే అవకాశాలు ఉన్నాయి. జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న కోహ్లీ రెండు సీజన్లు మినహా కొనసాగే అవకాశం లేదు. కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ ఆటగాళ్లను వదులుకునే అవకాశాలు ఉన్నాయి.