యూఏఈలోని దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళుతున్న ఫ్లై దుబాయ్ విమానం, సుమారు 33 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఒక్కసారిగా అల్లకల్లోలం జరిగింది. కాక్‌పిట్‌లో పైలట్ల మధ్య ఘర్షణ, అరుపులతో పరిస్థితి భీభత్సంగా మారింది. కో-పైలట్ కెప్టెన్‌ను కత్తితో పొడిచి, విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించడంతో విమానం తలకిందులుగా పడిపోవడం మొదలైంది. దీంతో ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. విమానం హైజాక్ అయినట్లు సంకేతాలు రావడంతో, అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఘటన తరహాలోనే భారీ దాడి జరగవచ్చనే ఆందోళన నెలకొంది. కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే ఏవియేషన్ వర్గాలకు రెండు కీలక హెచ్చరికలు వచ్చాయి. మొదట సాధారణ ఎమర్జెన్సీ కోడ్ 7700 పంపగా, వెంటనే హైజాక్‌ను సూచించే 7500 కోడ్