SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య,! సీఎం, స్పీకర్‌ తీవ్ర సంతాపం!

అనంతగిరి కొండల్లో ఘోర రోడ్డు ప్రమాదం ఈరోజు చోటు చేసుకుంది. అంత్యక్రియలకు వెళ్తున్న ప్రయాణికుల బస్సు ఒక్కసారిగా లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముందు ముగ్గురు చనిపోగా, ఆ తర్వాత 5 గురికి పెరిగింది. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 03, 2026, 12:49 PM IST | Updated: Oct 03, 2026, 01:17 PM IST
Image Credit: Ananthagiri Hills Bus Accident: Credits X twitter
Join

Ananthagiri Hills Bus Accident: వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రయాణం చేసేటప్పుడు ప్రాణాలతో ఇంటికి చేరుకుంటామా అనే ఆందోళన నెలకొంది. కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలోకి వెళ్లడం వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పటాన్ చెరు నుంచి వికారాబాద్‌లోని చింతకుంటకు బంధువుల అంత్యక్రియల కోసం 54 మందితో వెళ్తున్న ఈ బస్సు ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను కాపాడేందుకు స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని సాక్షులు చెబుతున్నారు.

స్పీకర్‌ గడ్డం తీవ్ర విచారణ..
వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, వారు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విదేశీ పర్యటనలో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం, పలువురు గాయపడటం ఆయన దృష్టికి వచ్చిన వెంటనే, సంబంధిత అధికారులను అలర్ట్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే, ఆ తర్వాత మృతుల సంఖ్య పెరుగుతోంది. 5 గురికి చేరింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రభుత్వంగా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. వికారాబాద్ ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ వెంటనే స్పందించి, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, వారికి అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని సూచించారు.

 

 

మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పీకర్ గడ్డం ప్రసాద్ భరోసా ఇచ్చారు. బస్సు ప్రమాదంలో ముగ్గురు మరణించడం అత్యంత విచారకరం అని, విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ ఆయన వెంటనే అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ దుర్ఘటన జరిగింది.

 

 

సీఎం దిగ్భ్రాంతి..
అనంతగిరి ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి అధికారులను ఆదేశించారు. అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు అదుపుతప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకున్న సీఎం, సంబంధిత అధికారులతో వివరాలు అడిగి పరిస్థితిని సమీక్షించారు.

తిరుపతిలో తీవ్ర విషాదం.. నైట్‌ షిఫ్ట్‌లో ఒక్కసారిగా పేలిన బాయిలర్.. నలుగురు అక్కడికక్కడే మృతి! పూర్తి వివరాలు..

5 కు చేరిన మృతుల సంఖ్య..
అనంతగిరి 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో సుమారు 20 మందికి తీవ్ర గాయాలు కాగా, ఇప్పటివరకు మృతుల సంఖ్య 5 కు చేరింది. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వికారాబాద్, తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల ఆనవాళ్లు గుర్తించడం కూడా కష్టంగా మారినట్లు సమాచారం. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES