వరంగల్ జిల్లా ఆయూష్ మిషన్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..!!
Warangal Ayush Mission Recruitment 2026: వరంగల్ జిల్లాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ ఆయుష్ మిషన్ స్కీమ్ కింద జిల్లా ఆయుష్ శాఖలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 12 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Warangal Ayush Mission Recruitment 2026: వరంగల్ జిల్లాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ ఆయుష్ మిషన్ స్కీమ్ కింద జిల్లా ఆయుష్ శాఖలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ నియామకాల్లో ఆయుష్ వైద్యులు, వైద్య సిబ్బంది, సైకో సోషల్ కౌన్సిలర్లు, డైటీషియన్లు, మల్టీ పర్పస్ వర్కర్లు, యోగా ప్రొఫెషనల్స్ వంటి పోస్టులు ఉన్నట్లు కలెక్టర్లు తెలిపారు. పోస్టుల వారీగా అర్హతలు, ఇతర నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు అని తెలపారు. ప్రతి రోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వరంగల్ జల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిక కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు, ఇతర అర్హతలు, నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వరంగల్ జిల్లా అధికారిక వెబ్ సైట్ https://warangal.telangana.gov.in/ను సందర్శించాలని కలెక్టర్ సూచించారు.
వయస్సు:
అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST/BC/EWS అభ్యర్థులకు – 5 సంవత్సరాలు మాజీ సైనికులకు – 3 సంవత్సరాలు + సర్వీసు కాలం దివ్యాంగులకు – 10 సంవత్సరాలు
ఎంపిక విధానం:
ప్రొఫెషనల్ పోస్టులకు: అర్హత పరీక్ష మార్కులు (90 మార్కులు) + వయస్సు వెయిటేజీ (10 మార్కులు) ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.
MPW పోస్టుకు: రాత పరీక్ష (90 మార్కులు) + వయస్సు వెయిటేజీ (10 మార్కులు) ద్వారా ఎంపిక చేస్తారు.
Also Read: