SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా బీజేపీ కొత్త ఇన్‌చార్జుల నియామకం..

BJP New Incharges Of Telangana Andhra Pradesh: భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా కొత్త ఇంఛార్జ్‌లను నియమించింది. 28 రాష్ట్రాలతో పాటు 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వారిని నియమించింది. అటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాలకు బీజేపీ కొత్త రక్తం ఎక్కించింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Sep 23, 2026, 04:00 PM IST | Updated: Sep 23, 2026, 04:09 PM IST
Image Credit: Andhra Pradesh Telangana BJP Incharges
Join

Telugu States New Incharges: బీజేపీ దేశవ్యాప్తంగా కొత్త ఇన్‌చార్జులను  నియమించింది.  దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలతో పాటు  8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త రక్తాన్ని ఎక్కిస్తూ ఈ నియామకాలు చేపట్టింది.  పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్ నేతృత్వంలో ఈ నియామకాలను చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ అరవింద్‌ భదౌరియా.. తెలంగాణకు సునీల్‌ బన్సల్‌ నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. సునీల్ బన్సల్ విషయానికొస్తే.. గతంలో ఈయన తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో సహా ఇంఛార్జ్‌గా వ్యవహరించారు.

దేశ వ్యాప్తంగా కొత్త ఇన్‌ఛార్జులను నియమించిన బీజేపీ..

సహా ఇన్‌చార్జులుగా ఆంధ్ర ప్రదేశ్‌కు తమిళనాడుకు చెందిన  వనతి శ్రీనివాసన్‌ను, తెలంగాణకు అభయ్ పాటిల్, రేఖా శర్మను నియమించింది.  పార్టీని మరింత విస్తరించే ప్లాన్‌లో భాగంగానే ఈ కొత్త ఇన్‌చార్జుల నియామకాన్ని చేపట్టినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. అయితే తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాస్‌ .. గతంలో కమల్ హాసన్ పై పోటీ చేసి విజయం సాధించింది. తెలంగాణలో ముందుగా అధికారంలో రావడానికి సునీల్ బన్సల్ నియమాకం చేపట్టినట్టు సమాచారం. గతంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ సహా పలు రాష్ట్రాల్లో  ఈ నేతృత్వంలోనే పార్టీ అధికారంలోకి రాగలిగింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి గెలుపు గుర్రాలను తయారు చేయడంలో ఈయనకు మంచి పేరుంది. ఈయన నియామకంలో తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉందని  పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

వివిధ రాష్ట్రాలకు ఇంఛార్జ్‌ల విషయానికొస్తే..

అండమాన్ అండ్ నికోబార్‌లో ఢిల్లీకి చెందిన జై ప్రకాష్‌ను నియమించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో డాక్టర్ దేవేశ్ కుమార్ బిహార్‌కు ఇంఛార్జ్‌గా నియమించారు. అస్సామ్‌కు మంగళ్ పాండే, సహా ప్రభారిగా మనోజ్ టిగ్గా, బిహార్‌కు హారీష్ ద్వివేది, సంగీతా యాదవ్, రోహన్ గుప్తాను సహ ప్రభారిలుగా నియమించారు.  కేంద్రపాలిత ప్రాంతం ఛండీఘర్‌కు..మహేంద్ర పాండే..

దాద్రా నగర్ హవేలి, డ్యామన్ డయ్యూ కు - వర్షబెన్ నరేంద్ర భాయ్ దోషి

ఢిల్లీ -డాక్టర్ వినయ్ సహస్ర బుద్దిని నియమించారు. సహ ప్రభారిలుగా జ్యాంయాంగ్ సేరింగ్ నామగ్యాల్, శ్రీమతి దర్షాబెన్ జర్దోష్‌లను నియమించారు.

తమిళనాడు బీజేపీ సహా ఇంచార్జ్ గా ఎంపీ డీకే అరుణ నియామకం జరిగింది.

తమిళనాడు రాష్ట్ర బీజేపీ సహా ఇంచార్జ్ గా ఎంపీ డీకే అరుణ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్. ఇక తమిళనాడు ఇంఛార్జ్‌గా రామ్ మాధవ్ ‌ను నియమించారు. అటు కర్ణాటక ఇంఛార్జ్‌గా హరీష్ ద్వివేది, సహా ప్రభారిగా డాక్టర్ కాసం వేంకటేశ్వర్లు నియమించబడ్డారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES