KTR: నిజం నిలకడ మీదే తేలుతుంది.. మాజీ మంత్రి కొండా సురేఖ ట్విట్ పై కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..
Ktr reacts on Konda Surekha apology: మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన ట్విట్ పై కేటీఆర్ మాట్లాడుతూ ఇంకా క్షమాపణలు చెప్పే వాళ్లు చాలా మంది ముందు వరుసలో ఉన్నారన్నారు. అంతే కాకుండా నిజం నిలకడమీద తెలుతుందన్నారు.
ktr responds on Konda Surekha apologize tweet: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొండా సురేఖ చేసిన ట్విట్ హట్ టాపిక్ గా మారింది. గతంలో కేటీఆర్ పై, కేసీఆర్ కుటుంబం పై తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుంటున్నట్లు కొండా సురేఖ ప్రకటించారు. అంతే కాకుండా అపోసిషన్ పార్టీల నేతల్ని విమర్శించే క్రమంలో గతంలో ఆ వ్యాఖ్యల్ని చేశానన్నారు. నిజాలు తెలుసుకొకుండా తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు చెప్పారు. అంతే కాకుండా తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో కొండా సురేఖ చేసిన ట్విట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరిచుకుంది.
గత కొన్ని రోజులుగా కొండా సురేఖ సైలెంట్ గా ఉంటూ ఒక్కసారిగా కేటీఆర్ పై ట్విట్ చేయడం వెనుక అసలు మతలబు ఏంటని రాజకీయాల్లో సరికొత్త చర్చలు తెరమీదకు వచ్చాయి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మొన్న ఒక వార్తాపత్రిక తన పై చేసిన అసత్య ప్రచారంకు, ప్రచురణకు క్షమాపణ చెప్పిందని గుర్తు చేశారు. అదే విధంగా ఈరోజు ఈ మేడం సారీ చెప్పారన్నారు.
అంతే కాకుండా.. నిజం అనేది నిలకడ మీద తెలుస్తుందన్నారు. ఇంకా క్షమాపణలు చెప్పే వాళ్లు చాలా మంది ముందు వరుసలో ఉన్నారన్నారు. తమపై ఫోన్ టాపింగ్, ఫార్మూలా ఈ రేసింగ్ స్కామ్ అని, విద్యుత్ కుంభకోణం అంటూ చాలా ఆరోపణలు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. మా మీద ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేసే వారు భవిష్యత్తులో వరుసగా క్షమాపణలు చెప్తారంటూ కేటీఆర్ జోస్యం చెప్పారు. తమపై చేసిన ఆరోపణలన్ని దూదిపింజల్లాగా తెలిపోతాయన్నారు. కొండా సురేఖ తనపై చేసిన ట్విట్ చూసి లీగల్ టీమ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.