SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

BRS: 'రేవంత్‌ రెడ్డి నిర్లక్ష్యంతోనే హైదరాబాద్ నగరానికి తాగునీటి కష్టాలు': బీఆర్‌ఎస్‌ పార్టీ

BRS Party MLA Devireddy Sudheer Reddy Slams To Revanth Reddy: కేసీఆర్‌ కట్టించాడనే కోపం.. కేసీఆర్‌కు పేరు వస్తుందనే దురుద్దేశంతోనే రేవంత్‌ రెడ్డి మూడేళ్లు కాలయాపన చేసి ఇప్పుడు రిపేర్‌ చేస్తామంటున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ విమర్శించింది. కరువు రావడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుకు వచ్చిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి విమర్శించారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 06, 2026, 04:31 PM IST | Updated: Nov 06, 2026, 04:38 PM IST
Image Credit: Source: Devireddy Sudheerreddy Facebook
Join

Telangana Bhavan: 'కేసీఆర్‌పై కక్ష సాధింపుతో కాళేశ్వరం మరమ్మత్తులు చేయలేదు. కాంగ్రెస్ కాలగర్భంలో కలుస్తుందని ఇప్పుడు రిపేర్ చేస్తామని అంటున్నారు. రాష్ట్రంలో కరువు రావడంతోనే కాళేశ్వరం గుర్తుకు వచ్చింది. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ఏ నిర్ణయం రాకుండా సంబురాలు చేసుకున్నారు. డైవర్ట్ రాజకీయాలు చేస్తూ కాలం గడిపారు. మేడిగడ్డ మరమ్మత్తులు చేయడానికి మూడు నెలలు పట్టదు. కానీ మూడేళ్లు కాలయాపన చేసి ఇప్పుడు రిపేర్లు అంటున్నారు' అని విమర్శించారు.

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. 'అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లు బాగానే ఉన్నాయని చాలా సంస్థలు చెప్పినా ఎన్డీఎస్‌ఏ పేరుతో తెలంగాణ రైతులను ఎండబెట్టారు. కేసీఆర్‌ను బదనాం చేసేందుకు 750 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. హైదరాబాద్ నగరానికి తాగునీటి కష్టాలు వచ్చాయి. ఇప్పటికే 2 లక్షల 30 వేల ట్యాంకర్లు హైదరాబాద్‌లో వాడారు. కేసీఆర్‌ను బద్నామ్‌ చేయాలని రేవంత్ రెడ్డి బొక్కబోర్లా పడ్డారు. రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు' అని విజ్ఞప్తి చేశారు.

'సుంకిశాల రిటైనింగ్ వాల్ ఇప్పటివరకు రిపేర్ చేయించలేదు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటే విశాల దృక్పథం ఉండాలి. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి లాంటి మహనీయుడు ఆరోగ్య శ్రీ పథకాన్ని కేసీఆర్ కొనసాగించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు తుడపడం రేవంత్ రెడ్డితో సాధ్యం కాదు' అని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి స్పష్టం చేశారు.

'కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీలో మాకు మైక్ కట్ చేయకుండా సమయం ఇవ్వాలి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి కోరారు. ఏదో ఒక రకంగా మమ్మల్ని అసెంబ్లీకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. తమకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. 'రేవంత్ రెడ్డి ఎన్ని టార్గెట్స్ పెట్టుకున్నా బుల్లెట్స్ రీచ్ కావడం లేదు. ఏపీకి నీళ్లు పోలేదని సీఎం అబద్దాలు మాట్లాడుతున్నారు. దేశంలో బీజేపీ పెద్ద ఐరెన్ లెగ్ రేవంత్‌ రెడ్డి' అని విమర్శించారు. '2014లో బీజేపీ అతి కష్టం మీద అధికారంలోకి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు పెరిగాయి. బీజేపీ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి సైలెంట్‌గా ఉన్నాడు' అని ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి తెలిపారు.

సాగర్‌ ఎక్కడ? కుప్పం ఎక్కడ?
'నాగార్జున సాగర్ ఎక్కడ ఉంది. కుప్పం ఎక్కడ ఉంది? 72 టీఎంసీల నీళ్లు చంద్రబాబు తీసుకువెళ్లారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీళ్ల వినియోగంలో విఫలమయ్యారు' అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. ఢిల్లీకి మూటలు మోస్తూ రివేంజ్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలిపారు.

సిరిసిల్ల, సిద్దిపేట టార్గెట్ పెట్టుకున్నా మమ్మల్ని ఏం పీకలేరని రేవంత్‌ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బదులిచ్చారు. 'కొడంగల్‌లో తాగునీళ్లు లేవు. ఏపీలో రెడ్ బుక్.. తెలంగాణలో రేవంత్ రెడ్డి బుక్ నడుస్తోంది. రాష్ట్రంలో ఏ ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ గెలవడం పక్కా' అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ రావును తిట్టడమే రేవంత్ రెడ్డి అజెండా.. మరి ఇంకేం పనిపెట్టుకోలేదని పేర్కొన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES