• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /రేవంత్ రెడ్డి పర్యటన.. అచ్చంపేటలో రూ.450 కోట్ల పనులకు శ్రీకారం.. ఇందిరమ్మ చీరలు, కొత్త పెన్షన్లపై బిగ్ అప్‌డేట్!

రేవంత్ రెడ్డి పర్యటన.. అచ్చంపేటలో రూ.450 కోట్ల పనులకు శ్రీకారం.. ఇందిరమ్మ చీరలు, కొత్త పెన్షన్లపై బిగ్ అప్‌డేట్!

నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సుమారు రూ.450 కోట్ల విలువైన పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీతోపాటు చేయూత కింద కొత్త పెన్షన్ల పంపిణీని కూడా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి నేరుగా మధ్యమడుగుకు చేరుకుంటారు. అక్కడ రూ.18 కోట్లతో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు, రూ.15 కోట్ల అంచనాతో ఆలయ సమీపంలో హరిత హోటల్‌కు శంకుస్థాపన చేస్తారు. రూ. 38 కోట్లతో గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహం, ఇతర అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

Written ByRenuka Godugu
Published: Nov 26, 2026, 09:42 IST|Updated: Nov 26, 2026, 09:44 IST
joinshare
రేవంత్ రెడ్డి పర్యటన.. అచ్చంపేటలో రూ.450 కోట్ల పనులకు శ్రీకారం.. ఇందిరమ్మ చీరలు, కొత్త పెన్షన్లపై బిగ్ అప్‌డేట్!
Image Credit: CM Revanth Reddy Achampeta Tour:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
రేవంత్ రెడ్డి పర్యటన.. అచ్చంపేటలో రూ.450 కోట్ల పనులకు శ్రీకారం.. ఇందిరమ్మ చీరలు, కొత్త పెన్షన్లపై బిగ్ అప్‌డేట్!

రేవంత్ రెడ్డి పర్యటన.. అచ్చంపేటలో రూ.450 కోట్ల పనులకు శ్రీకారం.. ఇందిరమ్మ చీరలు, కొత్త పెన్షన్లపై బిగ్ అప్‌డేట్!

2

AP Panchayat Elections 2026: ఏపీ తొలివిడత పంచాయతీ ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం..

3

Hyderabad: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే టెకీ దుర్మరణం.. అసలేం జరిగిందంటే..?

4

AP First Phase Panchayat Elections: ఏపీలో ప్రారంభమైన తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..

5

తిరుమల చరిత్రలోనే అతిపెద్ద విరాళం.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు సమర్పించనున్న అజ్ఞాత భక్తుడు.. నేడు CM చంద్రబాబు సమక్షంలో అప్పగింత!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

CM Revanth Reddy Achampeta Tour: అనంతరం అచ్చంపేట నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభా ప్రాంగణంలో, జిల్లా పరిధిలోని పలు బీటీ రోడ్లకు 274 కోట్ల రూపాయలు, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, వెల్దండ ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 29.65 కోట్ల రూపాయలు, అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులకు 25 కోట్ల రూపాయలు, వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 130 అదనపు తరగతి గదుల నిర్మాణానికి 18 కోట్ల రూపాయలు, అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో నీటి సరఫరా మౌలిక సదుపాయాల కల్పనకు 16 కోట్ల రూపాయలు, అన్ననూరులో నూతన ఐటీడీఏ భవన నిర్మాణానికి 14 కోట్ల రూపాయలు, అచ్చంపేట పట్టణంలో ఆదివాసీ భవన నిర్మాణ పనులకు రెండు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తారు.

అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభ వేదికగా ఇందిరమ్మ చీరలను, చేయూత కొత్త పింఛన్లను ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రులు ఆలూరు లక్ష్మణ్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పర్యవేక్షించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అచ్చంపేటలో జరిగే బహిరంగ సభకు ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంపై ప్రతిపక్షం నుంచి ఏమైనా కౌంటర్ అటాక్స్ కనిపిస్తున్నాయా అంటే, ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నుంచి 4,63,857 మందికి కొత్త చేయూత పింఛన్లు అందించేందుకు మంజూరు పత్రాలను ఇప్పటికే పంపిణీ చేసింది. వికలాంగులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు వంటి అర్హులైన వర్గాలకు కొత్తగా 6,63,857 చేయూత పింఛన్లు అందనున్నాయి. వారి కుటుంబాలకు నెలవారీ ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నవారికి ఈ ప్రయోజనం ఈరోజు నుంచి అందనుంది. అయితే ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ ఏమిటంటే, గతంలో ఉన్న పింఛన్లను తొలగించి, ఆ స్థానంలో కొత్తగా ఎక్కువ మొత్తంలో ఇచ్చింది ఏమీ లేదని. ప్రభుత్వం మాత్రం చనిపోయిన వారి పేర్లను మాత్రమే తొలగించామని, అర్హులైన వారందరికీ ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నామని స్పష్టం చేసింది.

ఈ పింఛన్ విషయంలో ఎవరెవరికి కొత్తగా ఇవ్వబోతున్నారంటే, సుమారు 4,63,857 మందిలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు వంటి అర్హులైన వారందరికీ ఈ పింఛన్ అందించనున్నారు. రాజ్యాంగం ప్రతి పౌరునికి కల్పించిన సామాజిక న్యాయం, సమానత్వం, గౌరవప్రదమైన జీవనం అనే స్ఫూర్తికి అనుగుణంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాజ్యాంగ దినోత్సవమైన నవంబర్ 26 సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 4,63,857 మంది లబ్ధిదారుల ఖాతాల్లో చేయూత పింఛన్ డబ్బు జమ చేయనున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారందరినీ ఆదుకునేందుకు ఈ పింఛన్ల ద్వారా సహాయం అందించడం ప్రభుత్వ లక్ష్యం.

మరోవైపు ఇందిరమ్మ చీరల వివరాలను చూస్తే, కేవలం రేషన్ కార్డు ఉన్నవారికే ఇస్తారా లేక ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళకు 18 ఏళ్లు నిండితే ఇస్తారా అనే విషయంలో, ప్రభుత్వం దాదాపు ఈరోజు కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు అందించాలని నిర్ణయించింది. ఆర్థికంగా అండ అవసరమైన వారికి ఆసరా కల్పించడంతో పాటు మహిళలకు ఆత్మగౌరవాన్ని అందించడం ప్రజా ప్రభుత్వ సంక్షేమ విధానంలో భాగమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు నుంచి విస్తృత స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నారు. తెలంగాణ ఆడబిడ్డ చీర కేవలం ఒక వస్త్రం కాదని, అది ఆత్మీయతకు, గౌరవానికి ప్రతీక అని మంత్రి సీతక్క తెలిపారు. ఆడబిడ్డను గౌరవించే తెలంగాణ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ చీరలను అందిస్తామని ఆమె పేర్కొన్నారు. ఇక ఆ విషయానికొస్తే, దాదాపు తెల్ల రేషన్ కార్డు ఉన్న కోటి మంది మహిళలకు ఈ చీరలు అందించబోతున్నారు. ఇక ఈరోజు నుంచి ఆ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన తర్వాత, ఈరోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా చీరల పంపిణీ చేయబోతున్నారు.
ధన్యవాదాలు.

అనంతరం అచ్చంపేట నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభ ప్రాంగణంలో, జిల్లా పరిధిలోని పలు బీటీ రోడ్లను 274.32 కోట్ల రూపాయలతో, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, వెల్దండ ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటును 29.65 కోట్ల రూపాయలతో, అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులను 25 కోట్ల రూపాయలతో, వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 130 అదనపు గదుల నిర్మాణాలను 18.10 కోట్ల రూపాయలతో, అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో నీటి సరఫరా మౌలిక సదుపాయాల కల్పనను 16 కోట్ల రూపాయలతో, అమరాబాద్ మండలం మన్ననూర్‌లో నూతన ఐటిడిఏ భవన నిర్మాణాన్ని 14 కోట్ల రూపాయలతో, అచ్చంపేట పట్టణంలో ఆదివాసీ భవన్ నిర్మాణ పనులకు రెండు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Govt Schemes
Revanth Reddy
Trending News