SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

CM Revanth reddy: ఎల్ నినో ప్రభావం‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.!.

Tg Govt on El nino Crisis: ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే వర్షపాతం తగ్గి, భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో తాగునీటి సరఫరా, నీటి లభ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Written By Inamdar Paresh
Published: Oct 19, 2026, 04:41 PM IST | Updated: Oct 19, 2026, 04:54 PM IST
Image Credit: cm revanth reddy
Join

CM Revanth reddy govt on El nino impact in telangana: ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నినో మహామ్మారి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇప్పటికే దీని ప్రభావం వల్ల వర్షాలు లేక రైతన్నలు పంటలు పండక తీవ్ర అనిశ్చితి ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఎల్ నినోపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీరు, కరెంట్ లను జాగ్రత్తగా ఉపయోగించుకొవాలన్నారు. కరువు తాండవిస్తున్న నేపథ్యంలో పంటలు వేయడంతో కూడా రైతులు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ నినోపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో కరువు, ఎల్‌నినో పరిస్థితులను సమీక్షించి, వాటిని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క సభ్యురాలిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం  జీఓ ఆర్టీ నంబర్ 1523ను జారీ చేసింది.


గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మంత్రి సీతక్క అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగే పరిస్థితులపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాగునీటి భద్రతతో పాటు జల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలకంగా వ్యవహరిస్తోంది. 

వర్షపు నీటిని ఒడిసిపట్టేలా చర్యలు తీసుకున్నారు. భూగర్బ జలాలు పెంచేలా.. ఇంకుడు గుంతలు, పంట గుంతల ఏర్పాటు, ఊట కుంటల నిర్మాణం, నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తోంది. నీటి వనరులను కాపాడటం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భవిష్యత్తులో తాగునీటి కొరతను అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వేసవికి ముందే నీటి సమస్యలను  పరిష్కరించడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడం కోసం సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఈ కేబినెట్ సబ్ కమిటీకి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. 


దీనిలో మంత్రి సీతక్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి ఎప్పటికప్పుడు ప్రభుత్వంకు నివేదికలు ఇవ్వడంతో పాటు, అధికారులకు  ఈ కేబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు జారీచేస్తుంది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES