SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Mla Rammohan Reddy: అసెంబ్లీ సమావేశంలో మరో రచ్చ ... సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

cm Revanth reddy: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ మాట్లాడారు. దీనిపై బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి నెట్టింట ట్రోల్స్ చేస్తుంది.

Reported By Inamdar Paresh Written By Inamdar Paresh
Published: Sep 16, 2026, 05:04 PM IST | Updated: Sep 16, 2026, 05:12 PM IST
Image Credit: cmrevanthreddy(file)
Join

Mla Rammohanreddy forgets cm revanth reddy name in Telangana assembly session: తెలంగాణలో  అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య తగ్గా ఫార్ వార్ నడుస్తుంది. అన్నిపార్టీలు కూడా పదునైన వాగ్బాణాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సభలో మాట్లాడారు. ఏకంగా సీఎం రేవంత్ పేరును మర్చిపోయారు. 

 

 

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ మాట్లాడి ఒక్కసారిగా సవరించుకున్నారు. దీంతో అప్పటి వరకు జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. ఏకంగా  సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన పార్టీకి చెందిన సీఎం రేవంత్ రెడ్డి మర్చిపొవడం నెట్టింట వైరల్ గా మారింది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటిన కూడా.. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి రెండున్నరేండ్లు అవుతున్నా ఆయన పేరును క్యాబినెట్‌ మంత్రులు, సొంత పార్టీ నేతలు, ఇతర ప్రముఖులు సైతం మర్చిపోతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపేరును అల్లు అర్జున్ మర్చిపోయాడని పెద్ద రచ్చ రాజుకుంది.తన పేరుమర్చిపోయినందుకు సీఎం రేవంత్ అల్లు అర్జున్ కు చుక్కలు చూపించారని అప్పట్లో ప్రచారంజరిగింది. 

Read more: Hyderabad: సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో గందరగోళం.. కేటీఆర్ పీఏ, పీఆర్వో మహేష్‌లపై గుర్తుతెలియని దుండగుల దాడి.. !

ఇది మరవక ముందే మరల ఒక ప్రైవేటుకార్యక్రమంలో యాంకర్ ఇదే తప్పిందం చేశాడు. తాజాగా.. సొంత పార్టీకి చెందిన 
ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సీఎం రేవంత్ పేరును మర్చిపొవడంతో రచ్చ రాజుకుంది. దీనిపై బీఆర్ఎస్ సీఎం రేవంత్ ను ట్రోల్స్ చేస్తున్నారు. కాంగ్రెస్‌ మంత్రులకు, సీనియర్‌ నేతలకు కూడా సీఎం ఎవరో తెలియదా..? అని నెటిజన్లు సైతం సెటైర్లు వేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES