మరో 2 రోజులు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..
Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో పలు మార్పుల మూలంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
IMD Alert to Northen Telangana: ఉత్తర తెలంగాణలో రానున్న రెండు రోజులు పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఈ సమయంలో చెట్ల కింద కానీ..కరెంట్ స్తంభాల దగ్గర, బడా హోర్డింగ్‌ల నిల్చోవడం కానీ చేయరాదని అధికారులు చెబుతున్నారు.
అల్పపీడనం ఎఫెక్ట్..
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం పరిధిలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, జగిత్యాల, జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రానున్న రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఋతుపవనాల ముగింపు..
ఈ రోజు (సెప్టెంబర్ 26) నుంచి ఋతుపవనాలకు సంబంధించిన సీజన్ ముగిసింది. ఈ రోజు నుంచి తెలంగాణలో ఉక్కపోత లాంటి పరిస్థితులు ఉండనున్నాయి.మరోవైపు తీవ్ర వాయుగుండం ప్రభావం దాదాపు ముగిసినట్టే. ఈ రోజు, రేపు కేవలం ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురిసి ఆగిపోనున్నాయి. ఈ సీజన్‌లో కురిసిన ఈ వర్షాలతో ఉత్తర తెలంగాణలో పలు ప్రాంతాల్లో నీటి మట్టాలు, భూగర్భ జలాలు రీఛార్జ్ కావడం కొంతలో కొంత ఊరట అని చెప్పాలి.
పెరగనున్న ఉష్ణోగ్రతలు..
సెప్టెంబర్ 26 నుండి, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వేడి, పొడి వాతావరణం ఉంటుంది, వర్షాలు తక్కువగా కురుస్తాయి. అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే చాలా చోట్ల ప్రధానంగా పొడిగానే ఉంటుంది. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 2 వరకు తెలంగాణ అంతటా తీవ్రమైన ఉక్కబోత ఉండే అవకాశాలున్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 34-36°C వరకు నమోదయ్య అవకాశాలున్నాయి.
ఆ తర్వాత, తూర్పు గాలుల ప్రభావం ..ఈశాన్య రుతుపవనాలకు ముందు వచ్చే వర్షాలు కారణంగా అక్టోబర్ 3-10 మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.