SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kavitha: ది ప్యారడైజ్ మూవీలో కేసీఆర్‌ను అవమానించారు.. కల్వకుంట్ల కవిత సెన్సెషనల్ కామెంట్స్..

kavitha responds on the paradise movie song: నేచురల్ స్టార్ నాని హీరోగా ఇటీవల రిలీజైన ది ప్యారడైజ్ మూవీ ఇప్పటికే బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా వినాయక నిమజ్జనం వేళ ఈ మూవీలోని పాటలే ఎక్కడ చూసిన విన్పిస్తున్నాయి.ఈ క్రమంలో తాజాగా.. ఈ మూవీపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written By Inamdar Paresh
Published: Sep 26, 2026, 06:57 PM IST | Updated: Sep 26, 2026, 07:04 PM IST
Image Credit: kcr(file)
Join

Kalvakuntla Kavitha sensational comments on the paradise movie: తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనం పైనల్ గా ప్రశాంతంగా ముగిసింది. గణేష్ నిమజ్జనాల్లో ఎక్కడ చూసిన కూడా ఇటీవల రిలీజైన నాని మూవీ ప్యారడైజ్ సినిమాలోని పాటలే హైలేట్ గా నిలిచాయి.  ముఖ్యంగా ఆయా షేర్ అనే పాట ఎక్కడ చూసిన డబుల్ సౌండ్ తో మార్మొగిపోయింది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తాను ది ప్యారడైజ్ మూవీ చూసినట్లు ట్విటర్ వేదికగా చెప్పుకొచ్చారు. మూడేళ్లుగా కేసీఆర్ బైటకు రావట్టేదని చెబుతున్న కాంగ్రెస్ వాళ్లు..  తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడన్న దానికి ఇంతకన్నా నిదర్శనంఏంకావాలంటూ మాట్లాడారు.

 ఇందులో మాజీ సీఎం కేసీఆర్ రోల్ చేసిన ప్రియదర్శిపై తెలంగాణ ప్రజలంతా  ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన అచ్చం కేసీఆర్ లా కన్పించాడని, ఈయనతో భవిష్యత్తులో కేసీఆర్ బయోపిక్ తీసేందుకు కూడా కొంత మంది డైరెక్టర్లు రెడీ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా.. కల్వకుంట్ల కవిత చిట్ చాట్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నాని మూవీ ది ప్యారడైజ్ పై ఇందులోని కేసీఆర్ పాత్రపై కవిత చేసిన కామెంట్ లు రాజకీయంగా దుమారంగా మారాయి.
ఇటీవల విడుదలైన నాని నటించిన మూవీ..ది ప్యారడైజ్ సినిమా బాగాలేదని, దీనిలో కేసీఆర్ ను అవమానించారని అన్నారు.  నేను అస్సలు చూడనని కవిత చెప్పుకొచ్చారు.

బీఆర్ఎస్ భవిష్యత్‌లో సోషల్ మీడియాలోనే ఉంటుందని కవిత జోస్యం చెప్పారు. కేసీఆర్ పాటలకు డబ్బులిచ్చి డ్యాన్స్ చేయిస్తున్నారంటూ కవిత ఎద్దేవా చేశారు. వచ్చే వేసవి నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కవిత కీలక ప్రకటన చేశారు. పవన్ టీమ్ నన్ను కావాలనే ట్రోల్ చేస్తోందని కవిత తీవ్రంగా స్పందించారు.

అదే విధంగా ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో తాము నిలవబోతున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్పాలన్నారు.

ఆదిలాబాద్ రిమ్స్‌లో వరుసగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు గాడితప్పుతున్నాయని సీఎం రేవంత్ సర్కారు చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.  ఇచ్చిన హమీలను నెరవేర్చడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

తన ఫామ్ హౌస్ పై వస్తున్న ఆరోపణలను కవిత ఖండించారు. ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు   ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై, ఇతర ప్రతిపక్ష నేతలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES