SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Karimnagar: నా భార్య ఫ్రీ బస్సు ఉందని వెళ్లిపోయింది.. పథకంపై కరీంనగర్ వ్యక్తి ఆవేదన.. వీడియో వైరల్..

Free bus Scheme in Telangana: తన భార్య అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిందని, వెతక డానికి ఐదు రోజులు పట్టిందని, రెండువేలు ఖర్చైందని కరీంనగర్ కు చెందిన బండి కనకయ్య చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Written By Inamdar Paresh
Published: Oct 27, 2026, 05:46 PM IST | Updated: Oct 27, 2026, 06:01 PM IST
Image Credit: karimnagar man on free bus row
Join

Karimnagar Man angry on Free bus scheme in Telangana: తెలంగాణలో ప్రభుత్వం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తుంది. దీనికి ప్రజలు నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఈక్రమంలో ప్రతిరోజు మహిళలు ఎక్కడకు వెళ్లిన కూడా ఉచిత బస్సు సదుపాయంను ఉపయోగించుకుంటున్నారు. కానీ కొంత మంది మహిళలు మాత్రం ఈ పథకంను పూర్తిగా అభాసుపాలు చేసేలా ప్రవర్తిస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల  ఈ పథకంపై మహిళలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా.. తెలంగాణలో ఉచిత బస్సు పథకంపై కరీంనగర్ లో ఒక వ్యక్తి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

 

 

 

కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బెజ్జంకి మండలం రేగులపల్లిగ్రామంలో జరిగిన సమావేశంకు స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ క్రమంలో బండి కనకయ్య అనే వ్యక్తితన భార్యతో ఉన్న రచ్చను కాస్త ఎమ్మెల్యేకు చెప్పుకున్నాడు. ఇటీవల తన భార్యకు, తనకు గొడవ జరిగిందని దీంతో ఎలాగైన ఫ్రీబస్  ఉందని చెప్పాపెట్ట చేయకుండా వెళ్లిపోయిందని  ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చెప్పాడు. 

అంతే కాకుండా తన భార్యను వెతకడానికి తనకు రెండు, మూడు రోజులు పట్టిందని, దీనికి 2 వేల వరకు ఖర్చు అయ్యిందని చెప్పాడు. దయచేసి ఈ ఉచిత బస్సుతీసేయాలని కోరాడు.పొరపాటున ఏచిన్న మాటలు అన్న కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని కనకయ్య చెప్పుకొచ్చాడు. అసలు తన భార్యకు డబ్బులు ఇవ్వకున్నా.. ఈ ఫ్రీ బస్సు వల్ల ఎక్కడికంటే అక్కడకు వెళ్తున్నారని, దయచేసి ఈ ఫ్రీ బస్సు పథకంను మాత్రం రద్దు చేయాలని కనకయ్య ఎమ్మెల్యేకు తెలిపాడు. 

ఈ క్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సదరు వ్యక్తిని భార్యను వెతకొద్దని పీఎస్ లో వెళ్లి ఫిర్యాదు చేయాలని సరదాగా మాట్లాడారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా అందరు నవ్వుకున్నారు. వీరి సంభాషణ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES