SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Konda Surekha: మళ్లీ బీఆర్ఎస్ గూటికి కొండా సురేఖ దంపతులు.. ?.. తెలంగాణ రాజకీయాల్లో సరి కొత్త చర్చ.!.

Konda surekha apology to ktr: గతంలో కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు మాజీ మంత్రి కొండా సురేఖ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. దీంతో బీఆర్ ఎస్ పార్టీలోకి కొండా సురేఖ దంపతులు చేరబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా జరుగుతున్నాయి.

Written By Inamdar Paresh
Published: Oct 29, 2026, 02:59 PM IST | Updated: Oct 29, 2026, 03:10 PM IST
Image Credit: kondasurekha(file)
Join

Konda Surekha and Konda murali likely to joins in brs rumours: తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ చేసిన ఒక ట్విట్ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. దీనిలో గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కానీ ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతే కాకుండా అపోసిషన్ పార్టీలను విమర్శించే క్రమంలో ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. అయిన కూడా నిజాలు తెలుసుకొకుండా మాట్లాడినందుకు తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసిందని ట్విట్ చేశారు.  నా వ్యాఖ్యలు వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవన్నారు. అదే విధంగా తాను చేసిన వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. 

అయితే కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి కొండా సురేఖ మరల సడెన్ గా కేసీఆర్ కు సారీ చెబుతూ ట్విట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. మరోవైపు ఇటీవల కొండా సురేఖ దంపతులు వరంగల్ లో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని తెలిపిన విషయం తెలిసిందే. 

 గతంలో కొండా సురేఖను మంత్రి పదవినుంచి బర్తరఫ్ చేసిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. అంతే కాకుండా కేసీఆర్ గతంలో తాము బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తమను ఎంతో గౌరవంగా చూసుకున్నారని చెప్పుకొచ్చారు. తమ కుటుంబం అడిగిన వెంటనే కేసీఆర్ కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని మాట్లాడారు.

 అదే విధంగా, పార్టీలో కొందరు వ్యతిరేకించినా కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకుని ఏకగ్రీవమయ్యేలా చూశారని కొండా సురేఖ గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలో కొండా సురేఖ అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. తొందరలోనే కొండా సురేఖ దంపతులు బీఆర్ఎస్ కండువ కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై కొండా సురేఖ దంపతులు అధికారికంగా స్పందిస్తేనేప పూర్తిగా క్లారిటీ రానుందని చెప్పుకొవచ్చు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES