• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /KTR: సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ: కేటీఆర్‌

KTR: సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ: కేటీఆర్‌

KTR Statement: Supreme Court Slap To Rahul Gandhi And Revanth Reddy: నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌పై సుప్రీంకోర్టు వేటు వేయడాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డికి చెంపపెట్టు అని ప్రకటించారు.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 24, 2026, 07:32 PM IST|Updated: Sep 24, 2026, 07:50 PM IST
joinshare
KTR: సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ: కేటీఆర్‌
Image Credit: Twitter

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Supreme Court Slap To Rahul Gandhi: పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా సుప్రీంకోర్టు కూడా అనర్హుడిగా ప్రకటించడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఈ తీర్పు సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ అని ప్రకటించారు. పార్టీ ఫిరాయించి దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా సుప్రీంకోర్టు తిరస్కరించిందని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడి కాంగ్రెస్‌ పార్టీ ప్రజల తీర్పును అపహాస్యం చేసిందని మండిపడ్డారు.

దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై 'ఎక్స్' వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి తీరును ఖండించారు. 'సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద హైకోర్టు విధించిన అనర్హతను సమర్థిస్తూ.. ఆ అనర్హత నుంచి తప్పించుకోవడానికి దానం నాగేందర్ చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిందని తెలిపారు. ఫిరాయింపులతో ప్రజల తీర్పును అపహరించి స్పీకర్ అండతో బయటపడవచ్చని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి భావించారని మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మూడేళ్లపాటు సాగిన ద్రోహం, నెరవేర్చని హామీలు, దుష్పరిపాలనపై ఖైరతాబాద్ ప్రజలు త్వరలోనే తమ తీర్పును ఇవ్వనున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎన్నికల సంఘంపై తీవ్ర వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ అంశంపై కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. 'ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే నిరంకుశంగా మారుతున్నది' అని మాజీ కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 'ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పే మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘం తీరు దాదాపు నియంతృత్వ ధోరణిలోకి వెళ్తోంది' అని తెలిపారు.

'ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పుడు ఎన్నికల సంఘం పనితీరును సరిదిద్దాల్సిన అవసరం ఉంది' అని మాజీ మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ముగ్గురిలో ఇద్దరు ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది మెజారిటీ కాదా? ఇప్పటివరకు మెజారిటీ అంటే ఇదే కదా.. ఇప్పుడు దాని నిర్వచనం కూడా మారుతున్నట్టుందని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఓటర్ల నమోదు, ఓట్ల తొలగింపు, తొలగించిన ఓట్లను తిరిగి చేర్చడం వంటి అంశాల్లో సందేహాలకు తావిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటే.. “అసలు మనం ఇంకా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?” అని మాజీ మంత్రి కేటీఆర్‌ నిలదీశారు.

'దేశ భవిష్యత్తును ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత ఉన్న సంస్థ పునాదులే బలహీనపడుతున్న పరిస్థితిలో దాని నిర్ణయాలకు వదిలేయలేం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ సంస్థలు, పౌర సంఘాలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు కలిసి ముందుకు రావాలి' బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణలో ఓట్ల తొలగింపు పెద్ద ఎత్తున జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్‌.. 'తెలంగాణలో అత్యధిక ఓట్ల తొలగింపులు బీఆర్‌ఎస్‌ పార్టీ గెలిచిన స్థానాల్లోనే ఉండడం ఆశ్చర్యం కలిగించలేదు' అని సందేహం వ్యక్తం చేశారు.

'తెలంగాణలో ప్రస్తుతం ఒకే పోరాటం జరుగుతున్నది. అది కేసీఆర్‌ వర్సెస్‌ అందరూ' అని మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి అనైతిక, అక్రమ, బహిరంగంగా ప్రకటించని కుమ్మక్కుకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఇప్పుడు ఆ కుమ్మక్కులోకి ఎన్నికల సంఘం కూడా చేరుతున్నట్టుగా కనిపిస్తోందని తలిపారు. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ పార్టీ న్యాయస్థానాల్లోనూ, ప్రజల మధ్యనూ పోరాడుతుందని మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా తొలగించిన ప్రతి ఓటును తిరిగి చేర్పిస్తామని తెలిపారు. 'తెలంగాణలో ఒకే ఒక్క ‘సార్‌’ ఉన్నారు. అది కేసీఆర్‌ సార్‌. ప్రజలకు ఆయనపై ఉన్న ప్రేమను ఏ ‘ఎస్‌ఐఆర్‌’ కూడా ఓడించలేదు' అని ప్రకటించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
KTR
BRS
Telangana News
Supreme Court