Man burn himself and suicide attempt in bheemgal police station: సమాజంలో పోలీసులను ఎంతో గౌరవంగా చూస్తారు. ముఖ్యంగా శాంతి భద్రతలను కాపాడటం కోసం రాత్రనక, పగలనక పనిచేస్తారు. అంతే కాకుండా తమ వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కన పెట్టి పనిచేస్తుంటారు. ఈ క్రమంలో కొంత మంది పోలీసులు మాత్రం దీనికి భిన్నంగా పనిచేస్తారు. అంతే కాకుండా ఫిర్యాదుల కోసం వచ్చిన వారితో అసభ్యంగా ప్రవర్తిస్తారు. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచాలు డిమాండ్ చేస్తారు.
పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. నిజామాబాద్‌లో కలకలం! నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పీఎస్‌లో సుధాకర్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. హోటల్ బయట టేబుళ్లు పెట్టడంపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. కోర్టుకు వెళ్లాలంటూ సుధాకర్‌ను స్టేషన్‌కు పిలిపించగా.. మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన సుధాకర్‌ను ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
— greatandhra (@greatandhranews) October 5, 2026
ఇక కొంత మంది అయితే ప్రతినెల మాముళ్లు వసూలు చేస్తు డిపార్ట్ మెంట్ కే చెడ్డ పేరువచ్చేలా ప్రవర్తిస్తారు. దీంతో పోలీసుల వేధింపులతో కొంత మంది బాధితులు పీఎస్ లోనే సూసైడ్ లకు యత్నించడం చేస్తారు. కొంత మంది ఇలాంటి పనులు చేసిన మొత్తంగా డిపార్ట్ మెంట్ కు చెడ్డపేరు వస్తుంది. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం నిజామాబాద్ లోని భీమ్ గల్ పరిధిలో చోటు చేసుకుంది.
నిజామాబాద్ భీమ్‌గల్ పీఎస్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భీమ్‌గల్ పట్టణంలో హోటల్ నడుపుకుంటున్న సుధాకర్ పీఎస్ కు వచ్చి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. దీంతో అరుపులు, కేకలు పెట్టడంతో అక్కడున్న స్థానికులు, పోలీసులు మంటలను ఆర్పేశారు. అయితే.. బాధితుడు రాత్రి 10 గంటల తరవాత హోటల్ బయట పెట్టిన టేబుళ్లను తీయమని వేధిస్తున్నారని ఆరోపించాడు.
ఇంకోసారి తప్పు చేయనని బ్రతిమాలిడిన పట్టించుకోలేదని వాపోయాడు. ఈ నేపథ్యంలో తనపై భీమగల్ ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేయడంతో మనస్తాపంకు గురైనట్లు చెప్పాడు. ఈరోజు కోర్టు కు వెళ్లాలంటూ పోలీస్ స్టేషన్ కి పిలవడంతో... ఆత్మహత్యాయత్నం చేసినట్లు సుధాకర్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో సుధాకర్ పరిస్థితి విషమం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పీఎస్ లో చోటు చేసుకొవడంతో డిపార్ట్ మెంట్ లో తీవ్ర కలకలంగా మారింది.