The paradise Congress vs BRS: నాని హీరోగా రూపొందిన 'ది ప్యారడైజ్' చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సికింద్రాబాద్ ప్రాంతంలోని ఒక కమ్యూనిటీ గుర్తింపు పోరాటం నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, సినిమా ప్రదర్శన కంటే కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ వైరుద్యానికి ఈ చిత్రం ప్రధాన కారణమైంది.
కేసీఆర్ తరహా పాత్ర
ఈ చిత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పోలిన ఒక ఎమ్మెల్యే పాత్రను ప్రవేశపెట్టడమే వివాదానికి మూలకారణమైంది. ఈ పాత్రకు నటుడు ప్రియదర్శి జీవం పోశారు. సవారీ తెగ గుర్తింపు కోసం కృషి చేయడం, అస్థిత్వ పోరాటంలో ఆయుధాలు పట్టిన వారిని శాంతి మార్గానికి మళ్లించడం, స్వర్గీయ ఎన్టీఆర్‌తో కలసి పౌరసత్వం కోసం పోరాడటం వంటి సన్నివేశాలు ఆ పాత్రను ఎంతో పాజిటివ్‌గా ప్రతిబింబించాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు కేసీఆర్‌ను తెలంగాణ అస్తిత్వ చిహ్నంగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం ముమ్మరం చేశారు.
కాంగ్రెస్ అంచనాలు, తలకిందులైన సమీకరణాలు
సినిమా విడుదలకు ముందు కాంగ్రెస్ శ్రేణులు ఈ కథను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశాయి. నాని పోషించిన 'జడల్' పాత్రను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా, విలన్ శిఖంజ్ మాలిక్ పాత్రను కేసీఆర్‌గా, అతని కొడుకు విక్రమ్ మాలిక్ పాత్రను కేటీఆర్‌గా పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. నాని అభ్యర్థనపై భద్రతా హామీలతో ప్రత్యేక ప్రీమియర్ షోలకు రేవంత్ రెడ్డి అనుమతి ఇవ్వడం కూడా కాంగ్రెస్‌కు కలసివస్తుందని భావించారు.
ప్రీమియర్ షోల తర్వాత మారిన పరిస్థితి అయితే, సెప్టెంబర్ 23న ప్రదర్శించిన ప్రీమియర్ షోల అనంతరం పరిస్థితి మారిపోయింది. సినిమా సెకండ్ హాఫ్‌లో కేసీఆర్ పోలికలు ఉన్న పాత్ర బాగా హైలైట్ కావడంతో కాంగ్రెస్ వర్గాల ప్రీ-రిలీజ్ ఉత్సాహం నీరుగారిపోయింది. ప్రస్తుతం రెండు పార్టీలు ఈ సినిమా అంశాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో ఈ పొలిటికల్ ఫైట్ కొనసాగుతోంది.
Also Read: KCR NTR Paradise: 'ది ప్యారడైజ్' సినిమాలో ఎన్టీఆర్, కేసీఆర్..కీలక పాత్రల్లో మాజీ సీఎంలు?! ఎవరు నటించారంటే?
Also Read: Nani Son Arjun: 'ది పారడైజ్' సినిమా రిలీజ్..కొడుకుతో హీరో నాని ఇలా..