Nani Son Arjun Massage: హీరో నాని నటించిన కొత్త చిత్రం 'ది పారడైజ్' మరికొద్ది గంటల్లో విడుదల కానుంది. ఈ రోజు రాత్రి నుంచే ప్రివ్యూ షోలు మొదలు కానున్నాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగించిన చిత్రబృందం ఇప్పుడు సినిమా రిజల్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఓ పక్క మూవీ యూనిట్ కాన్ఫిడెంట్‌గా పైకి కనిపించినా.. మరో పక్క సినిమా రిజల్ట్ పై ఎంతో టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉండగా.. తన సినిమా మరికొద్ది గంటల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరో నాని ఎలాంటి టెన్షన్ లేకుండా కనిపించడం ఇప్పుడు అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని, హీరో నాని తన కొడుకుతో హెడ్