SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bandi Sanjay: ప్రధాని మోదీకి ఎవరంటే పిచ్చి ఇష్టమో తెలుసా? చెప్పేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌

PM Modi So Much Love On Farmers And Soldiers: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్షలాది ప్రజలు ఇష్టపడుతుంటే.. మరి ప్రధాని మోదీకి ఎవరు ఇష్టమో తెలుసా? ఇద్దరు ప్రధాని మోదీకి పిచ్చి ఇష్టమంట. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. ఇంతకీ మోదీకి ఇష్టమైన వారిద్దరూ ఎవరో తెలుసా?

Written By Ravi Kumar Sargam
Published: Oct 30, 2026, 12:31 PM IST | Updated: Oct 30, 2026, 12:50 PM IST
Image Credit: Bandi Sanjay Modi
Join

PM Kisan Samman Nidhi: దాదాపు 13 ఏళ్లుగా దేశ ప్రధానిగా సేవలు అందిస్తున్న నరేంద్ర మోదీకి ఎవరంటే పిచ్చి ఇష్టమో తెలుసా? ఈ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సైనికులు, రైతులు పిచ్చిఇష్టమని చెప్పుకొచ్చారు. 'దేశానికి జై జవాన్, జై కిసాన్ రెండు కళ్లు. మోదీకి సైనికులు, రైతులంటే పిచ్చి ఇష్టం. రైతును రారాజు చేయడమే మోదీ లక్ష్యం' అని బండి సంజయ్‌ ప్రకటించారు.

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ విడుదల కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రసంగం చేశారు. '2014తో పోలిస్తే వ్యవసాయ బడ్జెట్ 5 రెట్లు పెంచాం. రైతును రారాజు చేయడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం. అందులో భాగంగానే రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని జమ చేస్తున్నాం' అని వెల్లడించారు. ఇప్పటివరకు 23 విడతలుగా రూ.4 లక్షల 47 వేల కోట్లు జమ చేశామని.. తాజాగా 9.34 కోట్ల మంది రైతుల ఖాతాల్లో మరో రూ.18,690 కోట్లు జమ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు.

'పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద తెలంగాణలో 30 లక్షల మందికిపైగా రైతులకు లబ్ది చేకూరుస్తున్నాం. కిసాన్ సమ్మాన్ నిధి సొమ్మును 92 శాతం మంది రైతులు వ్యవసాయానికే ఖర్చు చేస్తున్నారు. దీనివల్ల 85 శాతం మంది రైతుల ఆదాయం పెరిగింది' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. రైతు ఏడాది ఆదాయం ఐటీ ఎంప్లాయి నెల జీతంకంటే తక్కువేనని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల అభివృద్ది కోసం మోదీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని.. ఎరువుల రాయితీ కోసమే రూ.12 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్ం ఇచ్చే రాయితీతో రైతులకు ఎకరాకు రూ.18 వేలు ఆదా అవుతోందని చెప్పారు.

'తెలంగాణలోనూ దాదాపు 40 లక్షల మందికి కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చాం. రూ.50 వేల కోట్ల రుణాలు అందించాం. కోటి 10 లక్షల సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేశాం' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వివరించారు. కాంగ్రెస్ పాలనలో తిండి గింజలు లేక ఇతర దేశాల నుండి బియ్యం గింజలను దిగుమతి చేసుకునే దుస్థితి వచ్చిందని వాపోయారు. మోదీ నిరంతర కృషి, శాస్త్రవేత్తల నిరంతర పరిశోధనలతో వరి ఎగుమతుల్లో భారతదేం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ప్రకటించారు.

'రైతులకు తల్లి  మోదీ. తండ్రి ఐకార్-ఐఐఆర్ఆర్ వంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు. హైదరాబాద్‌ అంటే ఐటీయే కాదు, ఐకార్-ఐఐఆర్ఆర్ ఐకాన్‌గా మారింది' అని బండి సంజయ్‌ తెలిపారు. ఎల్‌నినోతో దేశవ్యాప్తంగా కరువొచ్చింది. తెలంగాణలో 11 లక్షల ఎకరాల్లో పంట వేయలేదు. ఈ సీజన్‌లో దాదాపు రూ.20 వేల కోట్ల పంట నష్టం వాటిల్లిందని అంచనా. రాష్ట్రంలో ఇంకా చాలా మండలాలను కరువు జాబితాలో చేర్చాలి. ఈ పరిస్థితుల్లో  శాస్త్రవేత్తలు కొత్త వంగడాలను సృష్టించి రైతులను ఆదుకోవాలి' అని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కోరారు. వికసిత భారత్ 2047 లక్ష్యం చేరుకోవాలంటే రైతులను భాగస్వాములను చేయాల్నదే మోదీ సంకల్పం అని చెప్పారు. రైతు, వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే వ్యవసాయాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లగలమని.. కలిసికట్టుగా పనిచేద్దాం.. రైతును రారాజును చేద్దామని పిలుపునిచ్చారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES