SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

సన్నబియ్యం ధరలకు కళ్లెం.. గరిష్ఠ ధరలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం..!!

Sanna Biyyam Rates: తెలంగాణలో అడ్డగోలుగా పెరుగుతున్న సన్నబియ్యం ధరలకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. మిల్లర్లు, వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి.. బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తూ రేట్లు పెంచుతున్నారనే ఫిర్యాదులతో పౌరసరఫరాల శాఖ తక్షణమే చర్యలకు పూనుకుంది.

Written By Bhoomi
Published: Nov 01, 2026, 09:12 AM IST | Updated: Nov 01, 2026, 09:14 AM IST
Image Credit: Sanna Biyyam Rates
Join

Sanna Biyyam Rates: తెలంగాణలో అడ్డగోలుగా పెరుగుతున్న సన్నబియ్యం ధరలకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. మిల్లర్లు, వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి.. బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తూ రేట్లు పెంచుతున్నారనే ఫిర్యాదులతో పౌరసరఫరాల శాఖ తక్షణమే చర్యలకు పూనుకుంది. సాధారణ ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు వివిధ రకాల సన్నబియ్యానికి సంబంధించి గరిష్ఠ చిల్లర విక్రయ ధరలను   ఖరారు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

శనివారం మిల్లర్లు.. వ్యాపారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ధరలను ఖరారు చేసింది. తాజా నిర్ణయం ప్రకారం.. బీపీటీ.. కేఎన్ రకం బియ్యం కిలోకు గరిష్టంగా రూ. 66, తెలంగాణ సోనా.. ఆర్ఎన్ఆర్ రకం రూ. 74.. హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రకాలను రూ. 79 మించి విక్రయించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఈ ధరల పట్టికను ప్రతి దూకాణంలోనూ వినియోగదారులకు కనిపించే విధంగా తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

ఈ మధ్య మార్కెట్లో నాణ్యమైన సన్న బియ్యం కిలో రూ. 75 నుంచి రూ. 95 వరకు విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. శనివారం హైదరాబాద్ లోని కూకట్ పల్లి పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తూకంలో తేడాలు.. ఎంఆర్పీ స్టిక్కర్లు ట్యాంపరింగ్ వంటి ఉల్లంఘనలపై 6 కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 420తో పాటు నిత్యావసర వస్తువుల చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


అయితే, సిబ్బంది కొరత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా బియ్యం దుకాణాలు, బియ్యం మిల్లులు, గిడ్డంగులలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించడం అధికారులకు సవాలుగా మారింది. ఒక దుకాణంలో తనిఖీలు ప్రారంభం కాగానే, సమీప ప్రాంతాల్లోని వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి వెళ్లిపోవడంతో, దర్యాప్తుకు ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో, నిరంతర తనిఖీలు, అక్రమ నిల్వలను గుర్తించడం, ఉల్లంఘనలపై తక్షణ చర్యలు తీసుకోవడం ధరల నియంత్రణకు కీలకంగా మారింది. 

Also Read: 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి!

2 లక్షల మందికి  కేవలం 33 వేల మందే దరఖాస్తు.. NMMS స్కాలర్‌షిప్‌పై విద్యాశాఖ డైరెక్టర్‌కు లేఖ..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES