SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ స్పెషల్ డ్రైవ్.. టీచర్లు వరుసగా లీవ్‌లు పెడితే చర్యలు తప్పవు..!!

Teacher Attendance Special Drive: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సర్కారు బడుల్లో విద్య ప్రమాణాలు పెరుగుపర్చడంతోపాటు బోధనను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ముందడుగు వేసింది.

Written By Bhoomi
Published: Nov 03, 2026, 11:02 AM IST | Updated: Nov 03, 2026, 11:04 AM IST
Image Credit: Teacher Attendance Special Drive:
Join

Teacher Attendance Special Drive: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సర్కారు బడుల్లో విద్య ప్రమాణాలు పెరుగుపర్చడంతోపాటు బోధనను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ముందడుగు వేసింది. ఈ నెల రాష్ట్రమంతటా 100శాతం హాజరు సాధించడమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ కు శ్రీకారం చుట్టింది. పాఠశాల నిర్వహణను చక్కగా  చేపట్టి.. ఈ నెల మొత్తం టీచర్లు, విద్యార్థులు 100శాతం హాజరు నమోదు చేసిన హెడ్ మాస్టర్లకు విద్యాశాఖ ప్రత్యేకంగా సన్మానించనుంది. అయితే అనారోగ్య కారణాలతో స్కూల్ కు రాలేని పిల్లలను ఈ డ్రైవ్ పేరుతో ఇబ్బంది పెట్టకూడదని అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

పర్యాటనల పేరుతో లీవ్‌లు.. విద్యాశాఖ సీరియస్:

ఇక నవంబర్.. డిసెంబర్ మాసాల్లో సిలబస్ పూర్తి చేయడం ఎంతో కీలకం. కానీ కొందరు ఉపాధ్యాయులు ఈ సమయంలోనే విహారయాత్రలు, వ్యక్తిగత పర్యటనలు, చివరికి విదేశీ టూర్లకు కూడా వెళ్తూ తరచూ సెలవులు పెడుతున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. దీనివల్ల విద్యార్థుల చదువు దెబ్బతినడమే కాకుండా పరీక్ష ఫలితాలపై తీవ్ర ప్రభావం పడుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇకపై అనవసర లీవ్‌లకు అడ్డుకట్ట వేస్తూ, తరచూ గైర్హాజరయ్యే టీచర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని నిర్ణయించారు.

హాజరు మెరుగుదలకు 8 సూత్రాల ప్రణాళిక:
ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును రోజువారీగా  ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా పక్కాగా నమోదు చేయాలి. ఏ బడిలోనూ  జీరో నమోదు  ఉండకూడదు. ఐదు రోజులకు పైబడి వరుసగా బడికి రాని విద్యార్థులను గుర్తించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడాలి. అవసరమైతే ఉపాధ్యాయులే నేరుగా వారి ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. నెట్‌వర్క్, ఎఫ్‌ఆర్‌ఎస్ పరికరాల సమస్యలను 48 గంటల్లోపు, ఓడీ ఎంట్రీలను 24 గంటల్లోపు పరిష్కరించాలి. బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచిన పాఠశాలలు, హెచ్‌ఎంలు, టీచర్లు..విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు పుస్తకాలు, పెన్నులు బహుమతిగా ఇస్తారు. నవంబర్ 22 నుంచి 30 వరకు జిల్లాల వారీగా డేటా సేకరించి, ఈ హాజరు డ్రైవ్‌ను విద్యా సంవత్సరం ముగిసే వరకు పొడిగించేలా డీఈఓలు, ఎంఈఓలు, క్లస్టర్ హెడ్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

మధ్యాహ్న భోజనం కాగానే బడికి తాళం.. టీచర్ల నిర్వాకంపై ఎంఈఓ విచారణ:
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ఎంత కృషి చేస్తున్నా, క్షేత్రస్థాయిలో కొందరు ఉపాధ్యాయుల తీరు విమర్శలకు దారితీస్తోంది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం జంబికుంట ఎంపీపీఎస్ పాఠశాలలో సోమవారం చోటుచేసుకున్న ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉదయం బడికి వచ్చిన ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం ముగిసిన వెంటనే పాఠశాలకు తాళం వేసి చెక్కేశారు. దీంతో చేసేదేమీ లేక విద్యార్థులు మధ్యాహ్నానికే ఇళ్లకు చేరుకున్నారు.

పాఠశాలలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజువారీ హాజరును  ఎఫ్ఆర్ఎస్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. వరుసగా 5 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు గైర్హాజరైన విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులను సంప్రదించాలని ఆదేశించారు. అవసరం అయితే వారి ఇంటికి వెళ్లాలని సూచించారు. నవంబర్ మొత్తం విద్యార్థులు, ఉపాధ్యాయులు వంద శాతం హాజరు సాధించిన ప్రధానోపాధ్యాయులను ప్రశంసాపత్రాలను సత్కరించనున్నారు. 

Also Read: 

20ఏళ్లుగా రాక్షస క్రీడ.. భార్యకు మత్తు ఇచ్చి.. భర్త ఫోన్‌లో 10 లక్షలకు పైగా అకృత్యాల ఫొటోలు, వీడియోలు..!!

అన్నం పెట్టేశారు.. తాళం వేసేశారు..పాఠశాల పనివేళల్లో టీచర్ల నిర్వాకం..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES