• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /ఎల్ నినో ఎఫెక్ట్.. సీతాఫలం.. మరింత ప్రియం..ఆకాశాన్నంటుతున్న ధరలు..!!

ఎల్ నినో ఎఫెక్ట్.. సీతాఫలం.. మరింత ప్రియం..ఆకాశాన్నంటుతున్న ధరలు..!!

Custard Apple Price: ఈ ఏడాది ఎల్‌నినో ఎఫెక్ట్‌తో సరైన వర్షాలు కురవక అన్ని రకాల పంట దిగుబడులు భారీగా పడిపోయాయి. దీని ప్రభావం సీజనల్ ఫ్రూట్ అయిన సీతాఫలంపై కూడా తీవ్రంగా పడింది.

Written ByBhoomi
Published: Nov 03, 2026, 12:31 PM IST|Updated: Nov 03, 2026, 12:33 PM IST
joinshare
ఎల్ నినో ఎఫెక్ట్.. సీతాఫలం.. మరింత ప్రియం..ఆకాశాన్నంటుతున్న ధరలు..!!
Image Credit: Custard Apple Price:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
అబద్దాలతో ఎప్పటికైనా నష్టాలు తప్పవని నిరూపించిన చిన్నారి చిట్టి కథ..!!

అబద్దాలతో ఎప్పటికైనా నష్టాలు తప్పవని నిరూపించిన చిన్నారి చిట్టి కథ..!!

2

నేపాల్‌లో రెండు హెలికాప్టర్ల ఢీ..ఒకరు మృతి..!

3

ఎల్ నినో ఎఫెక్ట్.. సీతాఫలం.. మరింత ప్రియం..ఆకాశాన్నంటుతున్న ధరలు..!!

4

Poco నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదరగొట్టే ఫీచర్లు!

5

200MP కెమెరా, 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు లీక్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

 Custard Apple Price: ఈ ఏడాది ఎల్‌నినో ఎఫెక్ట్‌తో సరైన వర్షాలు కురవక అన్ని రకాల పంట దిగుబడులు భారీగా పడిపోయాయి. దీని ప్రభావం సీజనల్ ఫ్రూట్ అయిన సీతాఫలంపై కూడా తీవ్రంగా పడింది. వానలు పడక పంట ఉత్పత్తి క్షీణించడంతో, మార్కెట్‌లో సీతాఫలాల లభ్యత తగ్గి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. యాపిల్ పండ్లకు సీతాఫలాలు పోటీ ఇస్తున్నాయి. ఎల్ నినో దెబ్బకు వర్షాలు కురవకపోవడం.. చెట్లను తొలగిస్తుండటంతో సీతాఫలాలు కనిపించకుండా పోతున్నాయి. సీజన్ వచ్చిందంటే గుట్టలు , బంజరు భూములు, అటవీ ప్రాంతాల నుంచి గంపల కొద్దీ సీతాఫలాలు మార్కెట్లోకి వచ్చేవి. కానీ ఈ సారి మాత్రం సామాన్యులకు అందనంత దూరంలోకి వెళ్లాయి.

రోగనిరోధక శక్తిని పెంచే..  సీజనల్ పండు సీతాఫలానికి మార్కెట్‌లో ఎల్లప్పుడూ.. మంచి గిరాకీ ఉంటుంది. అయితే ఈసారి వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో చెట్లకు కాయలు సరిగా కాయలేదు. దీనికితోడు పంట దిగుబడి తగ్గడంతో మార్కెట్‌కు వచ్చే సీతాఫలాల రాబడి పడిపోయి ధరలు ఒక్కసారిగా మండిపోతున్నాయి. ఎంతలా అంటే.. సూపర్‌ మార్కెట్లలో కిలో సీతాఫలం ఏకంగా రూ.200 వరకు పలుకుతోంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అతి తక్కువ ధరకే దొరికే ఈ పండు.. ఇప్పుడు సామాన్యుడికి అందని ద్రాక్షలా మారిపోయింది.

అయితే కేవలం వాతావరణ వైపరీత్యాలే కాకుండా, మానవ నిర్మిత కారణాలు కూడా ఈ కొరతకు కారణమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాలేజీలు, భారీ భవనాల నిర్మాణం కోసం అడవులు, గుట్టలను చదును చేస్తుండటంతో సహజ సిద్ధంగా పెరిగే సీతాఫలం చెట్లు కనుమరుగవుతున్నాయి. 

ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో సీతాఫలాలు దొరకడం మరింత అరుదుగా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో హైదరాబాద్‌ వ్యాప్తంగా నాణ్యతను బట్టి ఒక్కో పండు రూ.30 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు వీటిని కొనుగోలు చేయాలంటేనే వెనకడుగు వేస్తున్నారు.

Also Read: 

20ఏళ్లుగా రాక్షస క్రీడ.. భార్యకు మత్తు ఇచ్చి.. భర్త ఫోన్‌లో 10 లక్షలకు పైగా అకృత్యాల ఫొటోలు, వీడియోలు..!!

అన్నం పెట్టేశారు.. తాళం వేసేశారు..పాఠశాల పనివేళల్లో టీచర్ల నిర్వాకం..!!


 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News