• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Telangana Employees DA: తెలంగాణ ఉద్యోగులకు 2 డీఏలు ప్రకటన..ఉద్యోగ సంఘాల ఆగ్రహం..పోరుకు సిద్ధం!

Telangana Employees DA: తెలంగాణ ఉద్యోగులకు 2 డీఏలు ప్రకటన..ఉద్యోగ సంఘాల ఆగ్రహం..పోరుకు సిద్ధం!

Telangana Employees DA News: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలంగా నిలిచిపోయిన కరువు భత్యం (డీఏ) చెల్లింపులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చే దసరా పండుగకు ఒక డీఏ, ఉగాదికి మరో డీఏ ఇస్తామని లేదా కేబినెట్ నోట్ ద్వారా ఆమోదం తెలుపుతామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Written ByHarish Darla
Published: Sep 23, 2026, 06:52 PM IST|Updated: Sep 23, 2026, 06:56 PM IST
joinshare
Telangana Employees DA: తెలంగాణ ఉద్యోగులకు 2 డీఏలు ప్రకటన..ఉద్యోగ సంఘాల ఆగ్రహం..పోరుకు సిద్ధం!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Employees DA News: తెలంగాణలో ఉద్యోగుల పెండింగ్ డీఏల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. రాబోయే దసరాకు ఒక డీఏ, వచ్చే ఉగాది నాటికి మరొక డీఏ మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన భేటీలో, రెండు డీఏల విడుదలకు కేబినెట్ ఆమోదం కొరకు నోట్ పంపుతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) హామీ ఇచ్చారు. అతిత్వరలోనే మంత్రిమండలి భేటీ అయి దీనికి సంబంధించిన అధికారిక జీవోలు వెలువడతాయని ఉద్యోగులు ఆశిస్తున్నారు.

ఉద్యోగ సంఘాల స్పందన 
ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఉద్యోగ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. లక్ష్మారెడ్డి నేతృత్వంలోని జేఏసీ నాయకులు ఈ ప్రకటనను స్వాగతించారు. ప్రస్తుతం ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే కనీసం రెండు డీఏలు రావడం వల్ల ఉద్యోగులకు నెలవారీగా రూ.1,200 నుండి రూ. 4,000 వరకు ఆర్థిక ఉపశమనం కలుగుతుందని వివరించారు.

TGEJAC అసంతృప్తి..
మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలోని TGEJAC నాంపల్లిలోని టీఎన్జీవో భవనంలో సమావేశమై ప్రభుత్వ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. స్పష్టమైన అధికారిక జీవోలు లేకుండా కేవలం హామీలకే హర్షం వ్యక్తం చేయడం తగదని వ్యాఖ్యానించింది.

TGEJAC డిమాండ్లు, నిరసన 
ఉద్యోగుల సంక్షేమం కోసం TGEJAC ప్రభుత్వం ముందు పలు కీలక డిమాండ్లను ఉంచింది. అందులో మొదటిది ఈ నెల 30వ తేదీ నాటికి పీఆర్సీ (PRC) నివేదికను తెప్పించుకోవాలి. రెండోది పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం నెలకు రూ. 1,500 కోట్లు కేటాయించాలి. సీపీఎస్ (CPS), ఓపీఎస్ (OPS) విధానాలపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలి. చివరిగా వారి డిమాండ్లలో మూడోవది విద్యాశాఖలో జీవో నెంబర్ 25 కారణంతో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న తీవ్ర మానసిక ఒత్తిడిని తొలగించాలి.

సెప్టెంబర్ నెలాఖరుకల్లా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు రాకపోతే, అక్టోబర్ 2 నుంచి సత్యాగ్రహ దీక్షలు ప్రారంభిస్తామని TGEJAC స్పష్టం చేసింది. దీనిపై తదుపరి కార్యాచరణను చర్చించేందుకు సెప్టెంబర్ 24న ఉదయం 11 గంటలకు విస్తృతస్థాయి భేటీ నిర్వహించనుంది.

Also REad: Telangana Employees DA: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..2 డీఎలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం!

Also REad: Telangana PRC DA: ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, డీఏ మరింత ఆలస్యం..అసలు నిజం బయటపెట్టిన Zee భరత్!

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Employees
DA Hike
Telugu News