Published: Sep 23, 2026, 04:30 PM|Updated: Sep 23, 2026, 05:06 PM
Telangana Employees DA Update: ఎన్నో నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులు కోరుతున్న పెండింగ్ డీఏల్లో రెండు డీఏలను వెంటనే విడుదల చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు కూడా అంగీకారం తెలపడంతో రాబోయే తెలంగాణ రాష్ట్ర కేబినేట్ సమావేశంలో ఈ 2 డీఏల విడుదలకు అధికారికంగా ఆమోదం తెలిపే అవకాశం ఉంది.