SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. మరో 1.3 లక్షల ఉద్యోగాలు!

Telangana Government Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మొత్తం 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 14, 2026, 11:51 AM IST | Updated: Oct 14, 2026, 11:53 AM IST
Image Credit: Telangana Government Jobs
Join

 Telangana Government Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మొత్తం 2లక్షల ఉద్యోగాలను భర్తీ  చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 70వేల నియమకాలను చేపట్టినట్లు వెల్లడించారు. రానున్న రెండేళ్లలో మరో 1.3లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్లు సమాచారం.

కాగా  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల  నేపథ్యంలో ఢిల్లీలో మంత్రలుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై.. పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటర్లను గుర్తించి.. వారికి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాల ఇంచార్జీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పరిధిలోని పట్టభద్రలుతో సమావేశాలు నిర్వహించి.. ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలని సీఎం తెలిపినట్లు పలు కథనాలు వస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు.. ఉపాధి కల్పనకు ఇస్తున్న ప్రాధాన్యతను పట్టభద్రులకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నియామకాలు, పోటీ పరీక్షల  నిర్వహణలో లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1 పరీక్షల నిర్వహణతోపాటు డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతోంది.

ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మొత్తం 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న లక్ష్యాన్ని పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 70వేల నియమాకాలు చేపట్టామని.. మిగిలిన 1.3లక్షల ఉద్యోగాలను రానున్న 2ఏళ్లలో భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. అయితే ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో.. నియమకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలవుతాయి.. దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే వివరాలు అధికారిక ప్రకటనల ద్వారా వెల్లడికావల్సి ఉంది. ఉద్యోగార్థులు సంబంధిత శాఖల నోటిఫికేషన్లను గమనిస్తుండాలి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES