• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్ ట్రేడింగ్..పంజాబ్‎కు హార్దిక్ పాండ్యా.. ముంబై‎కు అర్ష‌దీప్ సింగ్‌..!!

ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్ ట్రేడింగ్..పంజాబ్‎కు హార్దిక్ పాండ్యా.. ముంబై‎కు అర్ష‌దీప్ సింగ్‌..!!

IPL 2027: ఐపీఎల్‎లో హార్థిక పాండ్యాపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. ఆల్ రౌండర్ హార్థిక్ ఇక నుండి పంజాబ్ కింగ్స్ తరపును బరిలోకి దిగనున్నారు.

Written ByBhoomi
Published: Nov 11, 2026, 10:40 AM IST|Updated: Nov 11, 2026, 10:42 AM IST
joinshare
ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్ ట్రేడింగ్..పంజాబ్‎కు హార్దిక్ పాండ్యా.. ముంబై‎కు అర్ష‌దీప్ సింగ్‌..!!
Image Credit: IPL 2027:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
నవంబర్ 16న రాష్ట్రంలో సెలవు.. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్..!!

నవంబర్ 16న రాష్ట్రంలో సెలవు.. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్..!!

2

సినిమాల్లో చూసే మరుగుజ్జుల గ్రామం నిజంగానే ఉంది.. ఎక్కడో తెలుసా?

3

అవాక్కయ్యే ఆఫర్ ఇచ్చిన ఎయిర్‌టెల్.. రూ. 349 ప్లాన్‌పై 1+1 ఉచిత ఆఫర్.. రోజూ 2GB డేటా, అపరిమిత 5G!

4

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. సిల్వర్ కిలోకు రూ.5 వేల మేర కిందకు..!!

5

భాయ్ దూజ్ రోజున చిత్రగుప్తుడినే ఎందుకు పూజిస్తారు? పూర్తి వివరాలు ఇవే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IPL 2027: ఐపీఎల్‎లో హార్థిక పాండ్యాపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. ఆల్ రౌండర్ హార్థిక్ ఇక నుండి పంజాబ్ కింగ్స్ తరపును బరిలోకి దిగనున్నారు. ముంబై ఇండియన్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఆటగాళ్ల ట్రేడింగ్ జరిగింది. ఈ విషయాన్ని బుధవారం ఐపీఎల్ అధికారికంగా స్పష్టం చేసింది. రెండు ఫ్రాంచైజీలు ఇష్ట ప్రకారమే ఆటగాళ్లను మార్పిడి చేసుకున్నాయి. దీనికి సంబంధించిన పేపర్ వర్క్ ను కూడా సోమవారమే బీసీసీఐకి అందించినట్లు సమాచారం. టాటా ఐపీఎల్ 2027 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ జట్టుతో ఆడనున్నాడు.

ఇక టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన అర్షదీప్ సింగ్ ముంబై జట్టుతో కలుస్తాడని ఐపీఎల్ తన స్టేట్ మెంట్లో స్పష్టం చేసింది. 18 కోట్ల ఫ్రైజ్ మనీతో హార్ధిక్ పాండ్యా పంజాబ్ జట్టులో చేరనున్నాడు. ముంబై అతనికి 16.35 కోట్ల ప్రైజ్ మనీ ఉంది. ఇక బౌలర్ అర్షదీప్ ప్రస్తుతం ఉన్న 18కోట్ల ఫీజుకే పంజాబ్ జట్టుతో కలవనున్నాడు. ఇక పంజాబ్ కింగ్స్ జట్టుకు 2019 నుంచి అర్షదీప్ ఆడుతున్నాడు. అతను 96 మ్యాచుల్లో 111వికెట్లు తీశాడు. అయితే తొలిసారి అర్షదీప్ తన స్వంత ప్రాంచైజీని వీడుతున్నాడు.  

పంజాబ్ కు హార్థిక్: 

ఈ ట్రేడింగ్‌తో ముంబై ఇండియన్స్ జట్టుతో హార్దిక్ పాండ్యాకు ఉన్న రెండవ విడత ప్రస్థానం ముగిసింది. 2015లో తొలిసారిగా ముంబై జట్టులోకి అడుగుపెట్టిన హార్దిక్, లీగ్‌లోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 2015, 2017, 2019,  2020 సీజన్లలో ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలవడంలో బ్యాట్, బాల్ రెండింటితోనూ కీలక పాత్ర పోషించాడు.

ముంబైతో 7 విజయవంతమైన సీజన్ల తర్వాత.. 2022 ఐపీఎల్ ముందర గుజరాత్ టైటాన్స్  జట్టులోకి వెళ్లి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. నాయకుడిగా అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలోనే గుజరాత్‌ను విజేతగా నిలిపి తన సత్తా చూపించాడు. ఆ తర్వాత 2023లో కూడా గుజరాత్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. 2024 సీజన్‌లో తిరిగి ముంబై ఇండియన్స్‌కు చేరుకుని సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 162 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ 146.28 స్ట్రైక్ రేట్‌తో 2,955 పరుగులు చేయడమే కాకుండా 82 వికెట్లు తీసి నిజమైన మ్యాచ్ విన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ముంబై దళంలోకి అర్ష్‌దీప్ సింగ్:
మరోవైపు పంజాబ్ కింగ్స్‌తో 8ఏళ్ల ప్రయాణానికి ముగింపు పలికి అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు. 2019లో పంజాబ్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్, తక్కువ సమయంలోనే దేశంలోనే బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. పంజాబ్ కింగ్స్ తరఫున 96 మ్యాచ్‌లలో 111 వికెట్లు పడగొట్టి ఆ ఫ్రాంచైజీ హిస్టరీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్  చేశాడు.

ఇన్నింగ్స్ ప్రారంభంలో కొత్త బంతితో స్వింగ్ రప్పించడంతో పాటు, డెత్ ఓవర్లలో అత్యంత కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో అర్ష్‌దీప్ దిట్ట. ఐపీఎల్ 2025 సీజన్‌లో 21 వికెట్లతో అదరగొట్టిన ఆయన.. 2026 సీజన్‌లో 14 వికెట్లు తీసి తన స్థిరత్వాన్ని చాటుకున్నాడు. అతని రాకతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం మరింత బలంగా మారనుంది.

Also Read: 

జాతీయ విద్యా దినోత్సవం.. IIT, UGCల వ్యవస్థాపకుడు ఆజాద్ ఆశయాలు నెరవేరుతున్నాయా?.. నేటి విద్యా వ్యవస్థ సవాళ్లు ఇవే..!!

విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లకు చెక్.. వరుస ఘటనలతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

 

Add Zee News as a Preferred Source
TAGS:
IPL
Sports News
Telugu News