SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Telangana Rain Alert: తెలంగాణలో ఎల్లో అలర్ట్..రాబోయే 5 రోజులు పిడుగులతో భారీ వర్షాలు..ఎక్కడెక్కడంటే?

Telangana Rain Alert: వాతావరణంలో ఏర్పడిన ఉపరితల అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి నవంబర్ 4వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల వేళ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Written By Harish Darla
Published: Oct 31, 2026, 01:44 PM IST | Updated: Oct 31, 2026, 01:47 PM IST
Join

Telangana Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు వర్షపాతం నమోదు కానుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉపరితలంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనిస్తోంది. ఈ వాతావరణ మార్పుల వల్ల ఈరోజు నుంచి నవంబర్ 4వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలను అప్రమత్తం చేస్తూ వాతావరణ శాఖ ఎల్లో వార్నింగ్ ప్రకటించింది.

నేటి వాతావరణం, ఈదురుగాలులు.. 
నేటి సాయంత్రం సమయంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పాటు యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో వాతావరణం గణనీయంగా మారనుంది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేశారు. అలాగే రేపటి రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నవంబర్ 2, 3 తేదీల్లో భారీ వర్షాల హెచ్చరిక..
ముఖ్యంగా నవంబర్ 2, 3 తేదీలలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ఈ రెండు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.

నవంబర్ 2వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

నవంబర్ 3వ తేదీన నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి.

అధికారుల సూచనలు, జాగ్రత్తలు..
ఈ వర్షాలు, బలమైన ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో బయట తిరగకుండా సురక్షితమైన ప్రదేశాలలో లేదా భవనాలలో ఆశ్రయం పొందాలని స్పష్టం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES