Mahesh Kumar Goud: దానం నాగేందర్ అనర్హత వేటు కేసీఆర్‌కు చెంపపెట్టు.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సెన్సెషనల్ కామెంట్స్..
Danam nagender disqualification Row: తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ, బీఆర్ఎస్ లు దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంను స్వాగతిస్తున్నాయి . దీనిపై తెలంగాణలో ఖైరతాబాద్ బైపోల్ పై హాట్ గా చర్చలు జరుగుతున్నాయి.
Tpcc chief Mahesh kumar goud responds on danam nagender row: తెలంగాణ రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు ఇటీవల అనర్హత వేటు వేసింది. దీనిపై అన్నిపార్టీలు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ క్రెడిట్ తమదేనంటూ బీఆర్ఎస్, బీజేపీల నేతలు కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కోర్టు ఆదేశాలపై దానం నాగేందర్ సైతం రియాక్ట్ అయి...తనకు యుద్దం కొత్త కాదని మరల ఎన్నికల బరిలో ఉంటానని తెలిపారు. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ వివాదంపై తాజాగా.. మాట్లాడారు.
దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్, కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటిదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల దుష్ట సంస్కృతిని తెచ్చిందే కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
"గతంలో టీడీపీ టికెట్‌పై గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన సబిత ఇంద్రారెడ్డిని బీఆర్ఎస్‌లో చేర్చుకుని కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చారని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ చర్యల వల్లే రాష్ట్రంలో ఫిరాయింపుల సంస్కృతి పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్, బీజేపీ పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని, ఇవి రెండు పైకి ఎన్ని ఆరోపణలు చేసుకున్న మరల ఒక్కటేనంటూ పీసీసీ చీఫ్ తీవ్ర విమర్శలు చేశారు.