SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Vikarabad: తాగేందుకు నీళ్లు లేవు.. బాత్రూమ్ కూడా బైటే.. వికారాబాద్ ఎస్సీ బాయ్స్ హస్టల్లో నీటి కష్టాలు..

Water crisis in vikarabad: ఏడాది క్రితం తమ హస్టల్ లో ఉన్న బోర్ పాడైపోయిందని వికారాబాద్ హస్టల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అయిన కూడా సిబ్బంది పట్టించుకోలేదని వాపోయారు.

Written By Inamdar Paresh
Published: Nov 05, 2026, 01:43 PM IST | Updated: Nov 05, 2026, 01:51 PM IST
Image Credit: Vikarabad sc hostel water crisis news
Join

Water crisis at boys sc hostel basheerabad in vikarabad: తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కన్పిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎల్ నినో తో అప్రమత్తంగా ఉండాలని, రైతులు పంటల విషయాలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మరోవైపు హైదరాబాద్ లో ఎక్కడ చూసిన నీళ్ల కొరతతోజనాలు అల్లాడిపోతున్నారు. పలు చోట్ల ప్రైవేటు హస్టల్ ల నిర్వాహకులు తాగునీటి ఆఫీసుల వద్దకు వెళ్లి నిరసనలు వ్యక్తం చేశారు. 

ముఖ్యంగా ఇటీవల ట్యాంకర్ నిర్వాహకులు నిరసనలు చేయడంతో మరింతగా హస్టల్ లోని ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల కాలేజీలకు దీపావళికి ముందుగానే సెలవుల్ని ప్రకటించారు.  హస్టల్ లో నీళ్ల సరఫరా లేక నిర్వాహకులు సైతం పలుచోట్ల నిర్వాహకులు చేతులెత్తేశారు.  ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో నీటి కష్టాలు మొదలయ్యాయి.  


వికారాబాద్ లోని  బషీరాబాద్ లో ఉన్న ఎస్సీ బాయ్స్ హస్టలో నీళ్లు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజులుగా ఈ సమస్య మరి ఎక్కువైందని విద్యార్థులు వాపోతున్నారు.  తమ హస్టల్ కు ఎదురుగా పోలీస్ స్టేషన్, పక్కనే ఉన్న ఎంఆర్‌సీ భవనం నుంచి నీటిని తెచ్చుకుని విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. 

ఏడాది క్రితం హాస్టల్‌లోని బోరు పాడైపోయినా ఇప్పటివరకు మరమ్మతులు చేయలేదని, మిషన్ భగీరథ కనెక్షన్ ఉన్నా నీటి సరఫరా జరగడం లేదని, కలెక్టర్ నిధులు విడుదల చేసినా బోరు మరమ్మతులు చేయడం లేదని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నీళ్ల కోసం విద్యార్థులు బకెట్లతో క్యూలు పెట్టి  నీటియుద్దాలు చేస్తున్నారు. 

దీనిపై అధికారులు చొరవ చూపించి చర్యలు తీసుకొవాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నవంబర్ లోనే ఇలా ఉంటే.. ఇక రాబోయే కొన్ని నెలలు ఇంకా ఎంత కష్టపడాల్సి వస్తుందో అని ప్రజలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES