SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలంగాణకు చల్లటి కబురు.. ఆ జిల్లాలో వర్షాలు..

Telangana Rains: తెలంగాణలో చాలా రోజుల తర్వాత పలు జిల్లాల్లో వర్షాలు కురవడంతో రైతుల్లో కొత్త ఆశ చిగురిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురవకపోయినా ప్రస్తుతం నెలకున్న వర్షభావ పరిస్థితుల్లో పడే ప్రతి చినుకు పంటలకు ఎంతో మేలు చేయనుంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 18, 2026, 12:54 PM IST | Updated: Oct 18, 2026, 12:58 PM IST
Image Credit: Telangana Rain Alert (ZEE News Telugu/Source)
Join

Weather Update: రాష్ట్రంలో నేడు రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు కూడిన ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు  వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్  నగర్, కరీంనగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  మంగళ, బుధవారాల్లోనూ కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది.

ఉపరితల ఆవర్తనం.. 

ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, దక్షిణ కోస్తాంధ్ర నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శనివారం నాగర్‌ కర్నూల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.

ఈదురు గాలులతో కూడిన వర్షాలు..

కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఫ్యూచర్‌ సిటీతో పాటు నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపైకి నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోగా, పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడ్డాయి. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హోర్డింగులు, విద్యుత్‌ స్తంభాలు, చెట్ల కింద నిలబడవద్దని అధికారులు సూచించారు.

ఆశించిన స్థాయిలో వర్షాలు.. 

రాష్ట్రంలో గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో వ్యవసాయ రంగంపై ఆందోళన నెలకొంది. ముఖ్యంగా పొలాల్లో ఇప్పటికే సాగులో ఉన్న పంటలకు తేమ అందడం కీలకంగా మారింది. ఈ పరిస్థితుల్లో తాజాగా కురిసిన వర్షాలు పంటల ఎదుగుదలకు కొంతవరకు తోడ్పడనున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిస్తే రైతులకు మరింత ఊరట లభించే అవకాశం ఉంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES