• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు.. ఈ నెల 27 వరకు ఓ మోస్తరు వర్షాలు..

తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు.. ఈ నెల 27 వరకు ఓ మోస్తరు వర్షాలు..

Telangana Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాదు పలు ప్రాంతాల్లో చిరు జల్లు కురిసే అవకాశాలున్నాయి.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 25, 2026, 08:34 IST|Updated: Nov 25, 2026, 09:56 IST
joinshare
తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు.. ఈ నెల 27 వరకు ఓ మోస్తరు వర్షాలు..
Image Credit: Telangana Rains (Source/ZEE Telugu News)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
తెలుగు తేజం అదుర్స్.. 'స్టార్ మిస్ టీన్ ఇండియా 2026' ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్ అమ్మాయి!

తెలుగు తేజం అదుర్స్.. 'స్టార్ మిస్ టీన్ ఇండియా 2026' ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్ అమ్మాయి!

2

Delhi: ఢిల్లీలో షాకింగ్ ఘటన..కేఫ్‌లో యువతిపై సాముహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్..

3

డిసెంబర్‌లో ఈ 4 రాశులకు తిరుగులేని అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారంలో బంపర్ లాభాలు!

4

రెగ్యులర్ కథలకు నో చెబుతున్న మిడ్ రేంజ్ కథానాయికలు.. ఢిఫరెంట్ స్టోరీలతో ఇమేజ్ మేకోవర్..

5

డిసెంబర్‌లో బుధాదిత్య రాజయోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే.. ఆర్థిక కష్టాలకు చెక్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Rains: గత కొన్నేళ్లుగా ఎన్నడు లేనట్టు తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి.  మరోవైపు ఈ సారి దసరా, బతుకమ్మ పండగల సందర్భంగా బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి స్థానికంగా ఉండే చెరువుల్లో నీళ్లు ఎండిపోయిన సంఘటనలు చూశాము. మరోవైపు మొన్న తుపానుల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిస్తాయని అనుకున్నారు. కానీ అవి ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లోనే కొన్ని జిల్లాలకే పరిమితమయ్యాయి. ఇక అక్వాన్ తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరుగుతాయనుకుంటే అది ఒడిషా వైపు వెళ్లిపోయింది. ఓ రకంగా తుపానుల కారణంగా తెలంగాణలో వర్షాలు కురిసి భూగర్భ జల మట్టాలు పెరుగుతాయనుకున్న ప్రజల ఆశలు అడియాసలయ్యాయి.

వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు..

మరోవైపు బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు  తెలంగాణలోని పలు జిల్లాలపై పెద్ద ప్రభావమే చూపుతుంది. ఈనెల 27 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వనపర్తి, నాగర్‌ కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది.

ఈనెల 27 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. 
ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో ఉదయాన్నే పొగమంచు దట్టంగా కమ్మేసే అవకాశం ఉంది. పొగమంచు కారణంగా రహదారులపై కనుచూపు మేర ఏమి కనబడటం లేదు. ఉదయం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు ఈ పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో వాహనదారులు లైట్ డిప్ వేసుకొని వెళ్లాలని సూచిస్తుంది. ముఖ్యంగా  తెల్లవారుజాము, ఉదయం వేళల్లో ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

నెలాఖరు నుంచి తెలంగాణలో విపరీతమైన చలి..

వర్షాల అనంతరం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని, నవంబర్ 29 నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాత్రి, తెల్లవారుజాము వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana Weather
Weather Update
Rain News
Telugu News