Rains in Telangana: అల్పపీడనం ప్రభావం.. తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
Imd heavy rain alert for Telangana: తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది.ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని ఐఎండీ బులెటిన్‌లో స్పష్టం చేసింది
Weather Update Heavy rain alert for Telangana: తెలంగాణలో గత కొన్నిరోజులుగా కుండపోతగా వర్షంపడుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలుజిల్లాల్లో భారీగా వర్షం కురుస్తుంది. అయితే.. తాజాగా..ఐఎండీ మరోసారి కీలక అలర్ట్ జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.
పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని బిగ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని అధికారులు కీలక సూచనలు చేశారు.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్త తీవ్ర వాయుగుండంగా మారి వర్షం దంచికొడుతుందని వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది.
ముఖ్యంగాఉత్తర తెలంగాణలోని పలుజిల్లాల్లో, భారీగా వానలు కురవడంతో పాటు, బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచించింది. గడిచిన 24 గంటల్లో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో అత్యధికంగా 12.9 సెం.మీ.ల వర్షం, ములుగు జిల్లా ఏటూరునాగారంలో 11.4 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు సమాచారం. ముఖ్యంగా రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిఅధికారులుసూచిస్తున్నారు.