SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Talasani Srinivas Yadav: బాధ్యతలు విస్మరిస్తోన్న ఎన్నికల సంఘం.. పూర్తిగా విఫలం: మాజీ మంత్రి తలసాని

Talasani Srinivas Yadav Alleges Election Commission Failed In Graduate Voter Registration Programme: ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని.. బాధ్యతలను విస్మరిస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరోపించారు. పట్టభద్రుల ఓటర్ల నమోదను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 31, 2026, 04:44 PM IST | Updated: Oct 31, 2026, 05:11 PM IST
Image Credit: Source: Talasani Srinivas Yadav X (Twitter)
Join

Graduate Voter Registration: ఎన్నికల కమిషన్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైతుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వాస్తవానికి ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉన్నప్పటికీ దానిని విస్మరిస్తోందని ఆరోపించారు. నామమాత్రంగా పట్టభద్రులు ఓటరుగా నమోదు ప్రక్రియ సాగుతుందని విచారం వ్యక్తం చేశారు.

భారీగా పట్టభద్ర ఓటర్ల నమోదు
హైదరాబాద్‌లోని సన్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్‌పేట, మోండా, పద్మారావు నగర్ డివిజన్‌లలో శనివారం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్తమం నిర్వహించారు. గ్రాడ్యుయేట్లకు ఓటరు నమోదు పత్రాలను అందించిన అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఓటు ప్రాధాన్యం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతోందని.. అయితే వాస్తవానికి ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని గుర్తుచేశారు. అయితే ఎన్నికల సంఘం బాధ్యతను విస్మరిస్తోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అవసరమైన మేరకు సిబ్బందిని నియమించుకొని  ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తన బాధ్యతలను పట్టించుకోని కారణంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు.

లక్షలాది మంది ఉన్నా..
బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఎంతో కష్టపడి  ఓటరు నమోదు పత్రాలను అధికారుల వద్దకు తీసుకెళ్లి ఇస్తే తీసుకోకుండా అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తుందని.. ఓటరు నమోదు కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శలు చేశారు. గత పట్టభద్రుల ఎన్నికలలో ఓటు వేసిన వారు కూడా తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవాలనడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం అధికారులను ప్రశ్నిస్తే వారి వద్ద సమాధానం లేదని తెలిపారు. సుమారు కోటి జనాభా కలిగి ఉన్న హైదరాబాద్ నగరంలో లక్షలాదిగా పట్టభద్ర ఓటర్లు ఉన్నప్పటికీ నామమాత్రంగా ఓటరుగా నమోదు ప్రక్రియ సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన గ్రాడ్యుయేట్ లు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోరారు.

విస్తృతంగా ఓటరు నమోదు
గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా బన్సీలాల్‌పేట, మోండా, పద్మారావునగర్‌ డివిజన్‌లలో గ్రాడ్యుయేట్‌లతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని అర్హులైన గ్రాడ్యుయేట్లు అందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు గ్రాడ్యుయేట్లకు తమ ఓటరు నమోదు పత్రాలను అందజేశారు. కాలనీలు, బస్తీలు అనే తేడా లేకుండా ఇంటింటికీ వెళ్ళి అర్హులైన గ్రాడ్యుయేట్ లను ఓటర్లుగా నమోదు చేయించాలని కోరారు. గతంలో ఓటు వేసిన గ్రాడ్యుయేట్ లు కూడా తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవాలని చెప్పారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES