KTR: కరువు పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత.. సీఎంపై కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..
ktr fires on cm revanth reddy: మూడు నెలల్లోనే హామీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసంచేశారంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతే కాకుండా ఎల్ నినో ప్రభుత్వంపై కాంగ్రెస్ తీరును తీవ్రంగా ఎండగట్టారు.
Ktr fires on cm revanth reddy govt on elnino crisis: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఎల్ నినో చుట్టు తిరుగుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో నిర్మల్ జిల్లాకు చెందిన కార్యకర్తలు, నాయకులు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి చేరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప్రస్తుతం మనం ఎదుర్కొంటుంది.. ప్రకృతి తెచ్చిన కరువు కాదని.. సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు పరిస్థితులకు కాంగ్రెస్ దే పూర్తి బాధ్యత అని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అసత్యపు హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. గతంలో సీఎం రేవంత్.. మూడు నెలల్లో ఎవరైనా పిల్లల్ని పుట్టిస్తారా?.. అన్నాడని మూడు నెలలంటే సరే.. మూడేళ్లు అయినా పిల్లలు పుట్టకపోతే ఎవరిది తప్పంటూ ఏకీపారేశారు.
కొత్త పథకాలు దేవుడెరుగు? ఉన్న పథకాలు కూడా బంద్ అయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తదని, గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తదంటూ మండిపడ్డారు.
కేసీఆర్ నీళ్లు, కరెంట్‌తో సహా పథకాలన్నీ ఇచ్చారని, కరోనా టైంలోనూ వడ్లు కొన్నారంటూ గుర్తు చేశారు. పదవిలో ఎవరున్నా ఇదంతా సాఫీగా సాగుతుందనే కొంత ధోరణి ఏర్పడిందన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్లుపూర్తిగా అబద్దపు హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక లాగా.. ఏం చేయాలో తెలీక కుంటి సాకులు చెప్తున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు.
గోదావరి, కృష్ణా నదుల్లో నీళ్లు పారుతున్నా.. తెలంగాణ ప్రజలకు నీళ్లులేకుండా ఎత్తిపోయకుండా నీళ్లను సముద్రం పాలు చేశారన్నారు.
కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటర్లు ఆన్ చేసి ఉంటే ఈ రోజు రైతులు, ప్రజలు ఇంతగా ఇబ్బందులు పడేవారు కాదన్నారు. కేసీఆర్ కు ఎక్కడ పేరు వస్తుందో అని.. కాళేశ్వరం పంపులు ఆన్న చేయకుండా రైతన్నలకు అన్యాయం చేశాడన్నారు.
గోదావరి నుంచి 750 టీఎంసీలు, కృష్ణా నుంచి 250 టీఎంసీల నీటిని సముద్రంపు పాలు చేశారంటూ మండిపడ్డారు. ఈ వెయ్యి టీఎంసీల నీటిని ఒడిసి పట్టి ఉంటే తెలంగాలో కోటి ఎకరాల సాగునీరు పండించే అవకాశం ఉండేదని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ ఏపీ వాళ్లు మాత్రం మన నీళ్లను మళ్లించుకుని కరువు రక్కసి నుంచి బైటపడ్డారన్నారు.
ఆంధ్రాలో పొలాల్లోకి.. తెలంగాణలో సముద్రంలోకి కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపథకంను వినియోగించుకోలేదన్నారు. యూరీయా, రైతులకు నీళ్లు, కరెంట్, సాగునీరువంటివి అన్నింటిలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలను మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు.