SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నేటి నుంచి 27 వరకు నషాముక్త్‌ భారత్ కార్యక్రమం.. 3 రోజుల పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాదయాత్ర..

Nasha Mukt Bharat Abhiyan: దేశ యువత భవిష్యత్తును పెనుభూతంలా నాశనం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హైదరాబాద్ నగరంలో నేటి నుంచి మూడు రోజుల పాటు నషా ముక్త భారత్ పాదయాత్ర నిర్వహించనున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 25, 2026, 09:09 IST | Updated: Nov 25, 2026, 09:54 IST
Image Credit: Nasha Mukth Bharat (Source/ZEE Telugu)
Join

Kishan Reddy Padayatra: హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త భారత్ పేరిట చేపట్టే ఈ యాత్ర అంబర్‌పేట్‌లో ప్రారంభమై, నవంబర్ 27న జూబ్లీహిల్స్‌లో ముగియనుంది. సుమారు 30 కిలోమీటర్ల మేర నగరంలోని ప్రముఖ కూడళ్ల మీదుగా ఈ పాదయాత్ర సాగనుంది.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న నషా ముక్త భారత్ అభియాన్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దేశ యువత ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో డ్రగ్స్ అతి పెద్దదని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.

మత్తు పదార్ధాలు వీడేలా చర్యలు.. 
మత్తు పదార్థాల బారినపడి ఎంతోమంది యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. డ్రగ్స్ మహమ్మారి వల్ల పంజాబ్ రాష్ట్రం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని గుర్తు చేసుకున్నారు.  అటువంటి దుస్థితి ఇతర రాష్ట్రాలకు రాకూడదనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోడీ నషా ముక్త్ భారత్‌కు శ్రీకారం చుట్టారని వివరించారు. మత్తుపదార్థాల వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

2029 వరకు డ్రగ్స్ రహిత దేశంగా భారత్.. 
2029 నాటికి దేశాన్ని మత్తు పదార్థాలు లేని సమాజంగా తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మహమ్మారిపై సాగే పోరాటంలో ప్రజలు, యువత పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రకు టాలీవుడ్ సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్‌లతో పాటు పలువురు క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు ఇప్పటికే తమ పూర్తి మద్దతు ప్రకటించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఇవాళ పాదయాత్రను సినీ నటుడు వెంకటేష్‌ ప్రారంభించనున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES