SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Telangana Politics: ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఎఫెక్ట్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల్లో టెన్షన్..!

Telangana Politics: కాంగ్రెస్ పార్టీలో రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత టెన్షన్ పట్టుకుందా..! ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై వేటు పడటంతో.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారా..! దానం నాగేందర్ తీర్పే తమకు వర్తిస్తుందనే ఆందోళన పడుతున్నారా..! వచ్చే నెలలో పార్టీ మారిన ఓ ఎమ్మెల్యేపై హైకోర్టులో విచారణ ఉండటంతో.. ఆయనపైన వేటు తప్పదనే చర్చ జరుగుతోందా..! మరో రెబల్ ఎమ్మెల్యేకు ప్రభుత్వ సలహాదారు పోస్టు శాపంగా మారిందని అంటున్నారా..! త్వరలోనే ఇద్దరిపైన వేటు పడుతుందని రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోందా..!

Written By Ashok Krindinti
Published: Sep 26, 2026, 08:39 PM IST | Updated: Sep 26, 2026, 08:41 PM IST
Image Credit: Telangana Politics
Join

Telangana Politics: తెలంగాణలో పార్టీ మారిన మరికొందరు రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత టెన్షన్ వెంటాడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల్లో ఒకరైన దానం నాగేందర్ పై వేటు పడటంతో.. మిగతా ఎమ్మెల్యేల్లోనూ తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. తాను పార్టీ మారు తప్పుచేశామా అన్న అనే సందిగ్ధంలో కొందరు ఎమ్మెల్యేలు ఉండగా.. ఇద్దరూ ఎమ్మెల్యేలపై మాత్రం.. తప్పక వేటు పడుతుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ మారిన రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ వీరిపైన వేటు తప్పదని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. పార్టీ మారిన వారిలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. పార్టీ మారిన తర్వాత మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి దక్కితే.. కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు ఎంపీగా అవకాశం దక్కింది. ఈ పదవుల పంపకాలే నేతకు శాపంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.. 

ప్రస్తుతం మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం పొలిటికల్ ఫ్యూచర్ పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలోనే పోచారం శ్రీనివాస్ రెడ్డిపైన అనర్హత వేటు పడుతుందని టాక్ వినిపిస్తోంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బాన్సువాడలో గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఆ తర్వాత.. కొద్దిరోజులకే అధికార పార్టీలో చేరిపోయారు. అప్పట్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు.. కారు పార్టీ నేతలను షాక్ కు గురిచేసింది. అందుకే మాజీ స్పీకర్‌ కు సీఎం రేవంత్ రెడ్డి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారుగా అవకాశం కల్పించారు. కానీ ప్రభుత్వ సలహాదారు పదవి దక్కినా పోచారంలో అసంతృప్తి మాత్రం చల్లారడం లేదు.. కొద్దిరోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు టార్గెట్‌గా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రి తమ ఫోన్ ఎత్తడం లేదని ఆరోపించారు. కనీసం నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు కూడా తీసుకెళ్లని పరిస్థితి నెలకొందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు పదవి చేపట్టినందుకు గానూ.. ఆయనపై వేటు తప్పదనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు దానంపై హైకోర్టు, సుప్రీంకోర్టు వేటు వేయడంతో.. త్వరలోనూ పోచారంపైన చర్యలు ఉంటాయని ప్రచారం సాగుతోంది. మరోవైపు పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారాడు అనేందుకు బలమైన సాక్ష్యాలను కోర్టు ముందు పెట్టేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ సిద్దమవుతోంది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన అభ్యర్ధి.. అధికారికంగా.. ఇతర పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న.. ప్రభుత్వంలో పదవులు చేపట్టిన.. పార్టీ ఫిరాయింపుల కిందకే వస్తుందని నిపుణులు సైతం చెబుతున్నారు..

మరోవైపు పోచారం మాదిరిగా.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పదవులు చేపట్టలేదు. కానీ ఈయనపైన వేటు తప్పదనే చర్చ జరుగుతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య ఎంపీగా పోటీ చేసి గెలిచారు. వరంగల్ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆమె ఘనవిజయం సాధించారు. అయితే ఎన్నికల ప్రచారంలో కూతురు కోసం ఎమ్మెల్యే శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు నామినేషన్ పత్రాలపైన ఆయన సంతకాలు చేశారు. ఒక పార్టీలో గెలిచి.. మరో పార్టీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వడమే.. ఆయన చేసిన తప్పని అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆధారాలను బీఆర్ఎస్ నేతలు కోర్టుకు సమర్పించినట్టు తెలుస్తోంది. ఈయన కేసు విచారణ ఆక్టోబర్ లో హైకోర్టు బెంచ్ ముందుకు రాబోతుంది. దాంతో దానం నాగేందర్ తరహాలోనే సాక్ష్యధారాలు బలంగా ఉంటంతో.. కడియం శ్రీహరిపైన వేటు తప్పదనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే మాత్రం.. ఖైరతాబాద్ తో పాటు.. స్టేషన్ ఘన్ పూర్, అలాగే బాన్సువాడ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమని అంటున్నారు.  

ఇదిలా ఉంటే.. పార్టీ మారిన మరికొందరు రెబల్స్ కు కూడా ఇదే టెన్షన్ పట్టుకుంది. కానీ వీళ్లు పార్టీ మారినట్టు ప్రతిపక్షం దగ్గర బలమైన ఆధారాలు లేవు.. దాంతో వీరిపైన వేటు ఉండకపోవచ్చని అంటున్నారు. త్వరలోనే ఖైరతాబాద్ బైపోల్ కు జరుగుతోంది. ఆలోపే కడియంపైన వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అనేది మాత్రం.. ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ లో చేరాక.. దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ తరఫునే పోటీలో ఉంటారా.. లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.. ఎందుకంటే.. కొద్దిరోజులుగా ఈ ఇద్దరూ నేతలు అధికార పార్టీపైన తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. దాంతో టికెట్ అంశంపైన అధికార పార్టీ  సైతం తర్జనభర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES