• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /Bandi Sanjay: నబిన్ చూపుల్లో ‘వాడి’ ఉంది.. కరీంనగర్ మహాపాదయాత్రలో బండి సంజయ్ సెన్సెషనల్ కామెంట్స్..

Bandi Sanjay: నబిన్ చూపుల్లో ‘వాడి’ ఉంది.. కరీంనగర్ మహాపాదయాత్రలో బండి సంజయ్ సెన్సెషనల్ కామెంట్స్..

Nitin nabin in Karimnagar: దేశ వ్యాప్తంగా బీజేపీ 40 ప్రాంతాల్లో 'ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం - అరాచకాన్ని అంతం చేద్దాం' పేరిట ర్యాలీలు చేపట్టింది.ఈ క్రమంలో బీజేపీ జాతీయ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్ జిల్లాలో జరిగే పాదయాత్రకు వచ్చారు.

Written ByInamdar Paresh
Published: Nov 23, 2026, 15:48 IST|Updated: Nov 23, 2026, 16:02 IST
joinshare
Bandi Sanjay: నబిన్ చూపుల్లో ‘వాడి’ ఉంది.. కరీంనగర్ మహాపాదయాత్రలో బండి సంజయ్ సెన్సెషనల్ కామెంట్స్..
Image Credit: Bandi Sanjay speech in karimnagar

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Bandi Sanjay: నబిన్ చూపుల్లో ‘వాడి’ ఉంది.. కరీంనగర్ మహాపాదయాత్రలో బండి సంజయ్ సెన్సెషనల్ కామెంట్స్..

Bandi Sanjay: నబిన్ చూపుల్లో ‘వాడి’ ఉంది.. కరీంనగర్ మహాపాదయాత్రలో బండి సంజయ్ సెన్సెషనల్ కామెంట్స్..

2

పాన్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. పాత, బ్లర్ ఫోటోతో KYC ఇబ్బందులా? మొబైల్‌లోనే 5 నిమిషాల్లో మార్చుకోండిలా!

3

మెగాస్టార్ కొత్త అవతారం.. ! మెగావర్స్ టాక్ షోకు క్యూ కడుతున్న స్టార్ హీరోలు..

4

డైరెక్టర్ క్షమాపణలు..! స్కిన్ షో వద్దన్న హీరోయిన్..! ఏమిటా కాంట్రవర్సీ..

5

మంచు విష్ణుతో ప్రభుదేవా మాస్టర్ ప్లాన్..! ఈ సారైన వర్కౌట్ అయ్యేనా..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Union Minister bandi Sanjay speech in Karimnagar: తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం  రాజకీయాలు కాకరేపుతున్నాయి.  ఈ క్రమంలో  రాబోయే ఎన్నికల్లో పాగా వేయాలని టార్గెట్ తో అన్ని పార్టీలు తమదైన స్టైల్ లో పావులు కదుపుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమంటూ నేతలు తరచుగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ క్రమంలో  బీజేపీ  జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్ లో జరిగిన మహా పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చంద్రరావు సైతం ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ వేదికగా భావొద్వేగంతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ పార్టీ రావడం ఖాయమంటూ జోస్యం చెప్పారు.

కరీంనగర్ లో కాషాయ దళ ప్రభంజనాన్ని చూసి నన్ను కన్న ఈ కరీంనగర్ గడ్డ ఉరకలేస్తోందన్నారు.
ఈ ప్రభంజనాన్ని చూసి నా మనసు పులకరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితిన్ నబిన్ కరీంనగర్ గడ్డపై అడుగు పెట్టినంక నా గుండె ఉప్పొంగుతోందన్నారు. నమ్మిన సిద్దాంతం కోసం, భుజం మీదనున్న కాషాయ జెండా కోసం తెగించి కొట్లాడతానని చెప్పుకొచ్చారు. కరీంనగర్ నా కాషాయ అడ్డా అని తొడగొట్టి సవాల్ విసరాలని ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ యాడ ఉందన్న కాంగ్రెస్ నేతల్లారా...ఇక్కడి ప్రభంజనాన్ని చూడాలని సవావ్ విసిరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టడానికి కాషాయ దళం ఎట్లా ఉరకలేస్తోందో చూడాలన్నారు.

 

నబిన్ చూపుల్లో ‘వాడి’ ఉంది....పక్కన నిలబడితే ‘వేడి’ తగులుతోందని బండి సంజయ్ భావొద్వేగంకు గురయ్యారు. నితిన్ అంటే నిజాయితీ, నైతికత.... నబీన్ అంటే నూతనత్వమంటూ చెప్పుకొచ్చారు. నిజాయితీతో కష్టపడుతూ నూతనత్వంతో పార్టీని  నితిన్ నబిన్ ఉరకలెత్తిస్తున్నారన్నారని చెప్పుకొచ్చారు. నితిన్  ఆషామాషీ లీడర్ కాదని, 25 ఏళ్లకే ఎమ్మెల్యే కావడంతోపాటు  5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర నితిన్ నబిన్ దన్నారు. 45 ఏళ్లకే ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ పార్టీకి అధ్యక్షుడైన ఘనత నితిన్ సొంతమన్నారు. ఒక సామాన్య కార్యకర్త ఇవాళ బీజేపీని నడిపిస్తున్నడంటే ఇది మామూలు విషయం కాదన్నారు.

నితిన్ నబిన్ కి స్కూల్ డేస్ లో రాజకీయాలంటే ఇష్టం లేదన్నారు. ఉన్నత విద్య చదివి మంచి పొజిషన్ లో ఉండాలనుకున్నారు. కానీ ఆర్ఎస్ఎస్ నేర్పిన క్రమశిక్షణ, నిబద్దత, నిజాయితీ, దేశం కోసం ధర్మం కోసం అంకిత భావమే ఈ స్థాయిలో నిలబెట్టిందన్నారు. కాషాయ కండువా కప్పుకున్న ప్రతి కార్యకర్త, నాయకుడు ఇదే సంకల్పంతో పని చేయాలన్నారు. తెలంగాణల అధికారం కోసం ఏళ్ల తరబడి నా బీజేపీ కార్యకర్తలు చేస్తున్న  పోరాటం మామూలుది కాదన్నారు.కాషాయ జెండా మోసి మోసి మోసి కార్యకర్తల భుజాలు కాయలు కాసినయ్ అని చెప్పుకొచ్చారు.

లాఠీ దెబ్బలు తిని ఒళ్లంతా గిర్రలు గీసినయన్నా.. అయినా నా బీజేపీ కార్యకర్త ఎన్నడూ భయపడలేదన్నారు. రాహుల్ గాంధీ ‘‘సర్’’తో మీకొచ్చిన నష్టమేందని ప్రశ్నించారు. చచ్చిపోయిన 3 కోట్ల మంది ఓట్లను తొలగిస్తే తప్పేందని ప్రశ్నించారు. మాజీ ప్రధాని పీవీ, పీసీసీ మాజీ చీఫ్ ఎమ్మెస్సార్ చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఓట్లు తొలగించలేదన్నారు. 2014కు ముందు అక్రమంగా దేశంలోకి వలస వచ్చిన 4 కోట్ల మంది ఓట్లను తీసేస్తే మీకొచ్చిన నొప్పేమిటన్నారు. శాశ్వతంగా వలస వెళ్లిన 6 కోట్ల మంది ఓట్లను తీసేస్తే మీకొచ్చిన నష్టమేందని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

కోటి మంది డూప్లికేట్ ఓట్లను తొలగిస్తే తప్పేందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పిస్తే మీకొచ్చిన బాధేందని ప్రశ్నించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వలస వచ్చిన ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ అనుకుంటుందా..? అని ప్రశ్నించారు. పప్పూ...ఇగ మీ పప్పులుడకవ్.. కేంద్రంలో ఉంది నిప్పు మోదీ... టచ్ చేస్తే మాడి మసైపోతావ్ జాగ్రత్త అంటూ ఫైర్ అయ్యారు. నువ్వెన్ని డ్రామాలాడినా, విదేశీ శక్తులతో కలిసి కుట్రలు చేసినా తగ్గేదేలేనంటూ చెప్పుకొచ్చారు.

విదేశీ అక్రమ వలసదారులు ఓట్లు, రేషన్ కార్డులు పొంది ఇక్కడి ప్రజల పొట్ట కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విదేశీ చొరబాటుదారులు ఈ దేశ ప్రధాని, సీఎంలను నిర్ణయించే అధికారం ఎవరిచ్చారన్నారు. డ్రగ్స్ బారిన పడి యువత అల్లాడుతుంటే మోదీ కంట తడి పెట్టారని బండి సంజయ్ ఎమోషనల్ అయ్యారు. నషా ముక్త్ భారత్ పేరుతో డ్రగ్స్ రహిత సమాజం కోసం పనిచేస్తున్నారన్నారు. 

కాంగ్రెస్ కు 90 సీట్లు, 1 కోటి ఓట్లు వస్తాయనడం పెద్ద జోక్ అని బండి సంజయ్ సెటైర్లు వేశారు. ఏం చేశారని మీకు అన్ని సీట్లు వస్తాయని, ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంను ఏకీపారేశారు. బీజేపీకి తెలంగాణ ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
BJP
PM Modi