SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బోన్స్ బలహీనంగా మారుతున్నాయా? ఈ 5 అలవాట్లు మానకపోతే ఆస్టియోపోరోసిస్ ప్రమాదం!

మీ ఎముకలు ఆరోగ్యంగా ఉన్నాయా? ఆస్టియోపోరోసిస్‌ వల్ల మన ఎముకలు మనకు తెలియకుండానే బలహీనంగా చేస్తుంది. దీంతో ఎముక ఫ్రాక్చర్‌ అయ్యే వరకు ఆస్టియోపోరోసిస్‌ వల్ల బోన్స్‌ వీక్‌గా మారాయని మనకు తెలియదు. మర రోజువారీ ఈ అలవాట్లు ఎముకలను బలహీనంగా మారుస్తాయి. అవి ఏంటి తెలుసుకుందాం

Written By Renuka Godugu
Published: Nov 10, 2026, 12:24 PM IST | Updated: Nov 10, 2026, 12:28 PM IST
Image Credit: Everyday Habits Ruining Bone Health :
Join

Everyday Habits Ruining Bone Health : ఎముకలు ఆరోగ్యంగా ఉండాలి. తద్వారా మాత్రమే శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే, సైలంట్‌గా ఆస్టియోపోరోసిస్‌ ఎముకలను దెబ్బదిస్తోంది.  రోజువారీ మన లైఫ్‌స్టైల్‌ దీనికి కారణం. పోషకాహారం లేకపోవడం, అతిగా ఆల్కహాల్‌ తీసుకోవడం కూడా ఎముక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రానురాను మీ ఎముక ఆరోగ్యం కూడా సన్నగిల్లుతుంది.

ప్రతిరోజూ ఈ అలవాట్లతో జాగ్రత్త..
సరైన కాల్షియం.. విటమిన్‌ డీ..
మన శరీర ఆరోగ్యానికి సరైన కాల్షియం, విటమిన్‌ డీ కూడా అవసరం. ఖనిజాలు సరైన మోతాదులో అందకపోతే ఎముకపై ప్రభావం చూపుతుంది. సమతుల ఆహారం ద్వారా మాత్రమే కాల్షియం మన శరీరానికి పుష్కలంగా అందుతుంది. అదేవిధంగా విటమిన్‌ డీ కూడా ఉదయం సూర్యరశ్మి ద్వారా పొందుతాం. లేదా సాయంత్రం సమయంలో కూడా పొందవచ్చు. ఇది సహజంగా సన్‌లైట్‌ ద్వారా అందుతుంది. దీంతో మన శరీరానికి కావాల్సిన విటమిన్‌ డీ లభిస్తుంది.

ఎక్కువ సమయం కూర్చోవడం..
ఎముక ఆరోగ్యం మనం రోజంతా ఎంతసేపు కూర్చుంటున్నాం అనే దానిపై కూడా ఆధాపడుతుంది. సరైన యాక్టివిటీ లేకపోతే ఇది కండరాల ఫిట్నెస్‌పై కూడా ప్రభావం చూపుతుంది. వాకింగ్‌, బరువు తగ్గించే యాక్టివిటీలు నిత్యం చేస్తూ ఉండాలి. ఎక్కువ సమయంపాటు కూర్చొని పనిచేయడం వల్ల మీ ఎముక ఆరోగ్యం కూడా కుంటుపడుతుంది.

వర్కౌట్‌..
ఎముక, కండరాల పనితీరు బాగుండాలంటే సరైన కదలికలు కూడా తప్పనిసరి. వయస్సు మళ్లుతున్న కొద్దీ కండరాలు నిర్వహించడం కూడా తప్పనిసరి. ఫిట్నెస్‌ ఉంటేనే ఎముక ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల సూచనతో కూడా మీరు ఎలాంటి వర్కౌట్స్‌ చేయవచ్చు? ఎంతసేపు చేయాలి? తెలుసుకోవచ్చు.

ధూమపానం..
ధూమపానం కూడా ఎముక ఆరోగ్యం పాడవ్వడానికి మరో కారణం. ఇది తరచూ బోన్‌ ఫ్రాక్చర్‌ అవ్వడానికి కారణమవుతోంది. చాలా రోజులుగా ఈ స్మోకింగ్‌ అలవాటు ఉన్నవారిలో పూర్తి ఎముకపై కూడా ప్రభావం చూపుతుంది. ధూమపానం మానేస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు.

Read Also: దీపావళి పూజకు వాడే వెండి, రాగి పాత్రలు నల్లగా మారాయా? ఈ సింపుల్ చిట్కాలతో తళతళ మెరిపించండి!

Read Also: దీపావళి పూజలో పాత మట్టి ప్రమిదలు వాడొచ్చా? 3 నిమిషాల్లో కొత్తవాటిలా మార్చే అద్భుతమైన హ్యాక్స్!

మద్యపానం..
కేవలం ధూమపానం మాత్రమే కాదు.. మద్యపానం వల్ల కూడా ఎముక ఆరోగ్యం కుంటుపడుతుంది. అతిగా మద్యం సేవిస్తే ఆరోగ్యానికే హానికరం. సమతుల ఆహారం తీసుకుంటూ, ఆల్కహాల్‌కు దూరంగా ఉంటే ఆస్టియోపోరోసిస్‌ బారిన పడకుండా ఉంటారు..

మీ రోజువారీ డైట్‌ ఆరోగ్యంగా ఉండేటా చూడండి.. ప్రోటీన్‌, కాల్షియం, విటమిన్‌ డీ మీ ఎముక, కండరాల ఆరోగ్యానికి అవశ్యకం.  సమతుల ఆహారం ప్రతిరోజూ సరిగ్గా ఉండాలంటే సరైన ప్రొఫెషనల్‌ సలహాలు కూడా తప్పనిసరి. ఆస్టియోపోరోసిస్‌ లక్షణాలు త్వరగా బయటపడవు. మీకు నొప్పి లేనంగా మాత్రనా మీ ఎముకలు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వయస్సు పెరిగుతున్నా.. ఫ్యామిలీ హిస్టరీ, గతంలో జరిగిన ఫ్రాక్చర్‌, ఎక్కువ రోజులపాటు మందులు వాడటం, హార్మోన్ల‌ మార్పులు కూడా కారణం అవుతాయి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES