• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /దీపావళి పండుగకు 5 చకచకా అయిపోయే ఎయిర్ ఫ్రైయర్ స్నాక్స్.. నూనె లేకుండానే అదిరిపోయే టేస్ట్!

దీపావళి పండుగకు 5 చకచకా అయిపోయే ఎయిర్ ఫ్రైయర్ స్నాక్స్.. నూనె లేకుండానే అదిరిపోయే టేస్ట్!

దీపావళి పండుగ అతి చేరువలో ఉంది. ఈ పండుగకు సాధారణంగా స్వీట్స్‌ ఎక్కువగా తీసుకుంటారు. అయితే, దీపావళి పండుగకు బంధువులు మీ ఇంటికి వస్తున్నారా? కేవలం స్వీట్స్‌ మాత్రమే కాదు ఎయిర్‌ఫ్రైయర్‌లో సులభంగా తయారు చేసుకునే 5 రిసిపీలు ఉన్నాయి. దీనికి పెద్దగా నూనె అవసంర లేదు. టేస్టీగా కూడా ఉంటాయి.

Written ByRenuka Godugu
Published: Nov 05, 2026, 03:19 PM IST|Updated: Nov 05, 2026, 03:22 PM IST
joinshare
దీపావళి పండుగకు 5 చకచకా అయిపోయే ఎయిర్ ఫ్రైయర్ స్నాక్స్.. నూనె లేకుండానే అదిరిపోయే టేస్ట్!
Image Credit: Air Fryer Diwali Snacks Recipes:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
షుగర్ ఉన్నవాళ్లు అన్నం తినకూడదా?.. ఎర్ర బియ్యంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!!

షుగర్ ఉన్నవాళ్లు అన్నం తినకూడదా?.. ఎర్ర బియ్యంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!!

2

ఇంటి నుంచే పాన్ కార్డ్.. ఆన్‌లైన్‌లో 10 నిమిషాల్లో అప్లై చేయండిలా..! సులభమైన ప్రాసెస్ ఇదే!

3

సోషల్ మీడియాలో మరోసారి మంగ్లీ పాట వైరల్‌.. ‘మాటి సీజన్ 2’ జానపద గేయానికి సూపర్ రెస్పాన్స్..

4

ZPTC And MPTC Elections: గొడవలేం లేవు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌ ప్రశాంతం: ఎన్నికల సంఘం

5

King Cobra Video: కింగ్ కోబ్రాతో డెంజర్ స్టంట్స్.. యువతి ధైర్యానికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్...

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Air Fryer Diwali Snacks Recipes: దీపావళి పండుగకు పెద్దగా ఫ్రై చేసుకోకుండా కొన్ని సింపుల్‌ రిసిపీలు కూడా ఉన్నాయి. దీంతో చకాచకా మీ పని పూర్తవుతుంది. పండుగాకు చకాచకా పని పూర్తి కావాలి.. ఎక్కువ సమయం, నూనె కూడా వృథా కాకుడదంటే ఇంట్లోనే సులభంగా దీపావళి స్నాక్స్‌ తయారు చేయండి. ఇవి ఎక్కువ సమయం తీసుకోకుండానే మీరు తయారు చేసుకోవచ్చు.

పనీర్‌ టిక్కా..
పనీర్‌ టిక్కా చాలామందికి ఫెవరెట్‌ డిష్‌.. ఈ దీపావళికి ఈజీగా పనీర్‌ టిక్కా తయారు చేసుకోవచ్చు. ఎయిర్‌ ఫ్రైయర్‌ ఇంట్లో ఉంటే చాలు.. ముందుగా పనీర్‌ క్యూబ్స్‌ కట్‌ చేసుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఉల్లిపాయలు, క్యాప్సికమ్‌, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, గరం మసాలా, కొద్దిగ శనగపిండి, నిమ్మరసం, ఉప్పు, కారం, పసుపు వేయండి. వీటిలో పనీర్‌ ఇతర కూరగాయలు కూడా వేసి కలపండి. ఓ అరగంట మ్యారినేట్‌ అయిన తర్వాత స్క్యూవర్‌కు గుచ్చండి. దీనికి బ్రష్‌తో నూనె కూడా కోట్‌ చేసి 180 డిగ్రీల వద్ద ఓ పది నిమిషాలు ఎయిర్‌ ఫ్రైయర్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చాక మరో వైపు కూడ ఓ పది నిమిషాలు ఉడికించండి. దీన్ని పుదీనా చట్నీతో వడ్డిస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది.

కార్న్‌ చీజ్‌ బాల్స్‌..
ఈ దీపావళికి ఈజీగా చేసుకునే మరో రిసిపీ కార్న్‌ చీజ్‌ బాల్స్‌.. మీ గెస్టులు కూడా ఎంతో ఇష్టంగా కూడా తింటారు. ఉడికించిన స్వీట్‌ కార్న్‌తో ఈ రిసిపీని తయారు చేస్తారు. ఇందులోనే గ్రేట్‌ చేసిన చీజ్‌, ఉడికించి, మ్యాష్‌ చేసిన బంగాళదుంప, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, మిరియాల పొడి, కార్న్‌ఫ్లోర్‌ వేసి బాగా కలపి, చిన్న బాల్స్‌లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్‌క్రంబ్స్‌లో కూడా దొర్లించి ఓ 20 నిమిషాలు వీటిని రిఫ్రిజిరేట్‌ చేస్తే మంచి షేప్‌ కూడా వస్తుంది. ఇప్పుడు వీటికి బ్రష్‌తో నూనె కోట్‌ చేసి 190 డిగ్రీల వ్ల ఓ పది నిమిషాలు ఎయిర్‌ ఫ్రై చేయాలి. గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత వేడివేడిగా వడ్డిస్తే బాగుంటుంది.

బేబీ మసాలా పొటాటో..
బేబీ పొటాటోతో కూడా ఎయిర్‌ఫ్రైయర్‌ రిసిపీ తయారు చేసుకోవచ్చు. ఇది కూడ రుచిగా ఉంటుంది. ఉడికించిన బేబీ పొటాటోలకు కాస్త నూనె, కారం, ధనియాల పొడి, వేయించిన ధనియాలు, జిలకర్ర పొడి, కాస్త ఉప్పు, ఆమ్‌చూర్‌ కూడా వేయాలి. ఇప్పుడు ఎయిర్‌ఫ్రైయర్‌ బాస్కెట్‌లో పెట్టి 200 డిగ్రీల వల్ల ఓ 15 నిమిషాలు ఎయిర్‌ ఫ్రై చేయండి. ఇక వీటి చివర్లు క్రిస్పీగా మారుతాయి. దీనిపై కొత్తిమీరా, చాట్‌ మసాలా జల్లుకుని తినాలి.

Read Also:  చలికాలంలో చర్మం పగులుతోందా? బామ్మల కాలం నాటి ఈ 5 రహస్య చిట్కాలతో మృదువైన మెరుపు!

Read Also: దీపావళి పూజలో పాత మట్టి ప్రమిదలు వాడొచ్చా? 3 నిమిషాల్లో కొత్తవాటిలా మార్చే అద్భుతమైన హ్యాక్స్!

మినీ సమోసా..
ఈ దీపావళి పండుగకి సమోసా లేకపోతే ఎలా? మీరు ఎయిర్‌ఫ్రైయర్‌లో చిన్న సమోసాలు తయారు చేసుకోవచ్చు. ఇందులో మీరు ఉడికించిన బంగాళదుంప, పచ్చిబఠాణీ, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, ఆమ్‌చూర్‌, గరం మసాలా, ఉప్పు వేసి చిన్న సమోసాలు తయారు చేయాలి. చిన్నగా సమోసాలు షీట్‌తో తయారు చేసుకోవచ్చు. దీనిపై కాస్త బ్రష్‌తో నూనె కోట్‌ చేయాలి. ఆ తర్వాత 180 డిగ్రీల వల్ల ఓ 15 నిమిషాల ఉడికిస్తే క్రిస్పీగా మారతాయి. దీన్ని కూడా పుదీనా లేదా చింతపండు చట్నీతో తీసుకోవాలి.

మసాలా మఖానా..
దీన్ని సాధారణంగా చాలామంది స్నాక్‌ రూపంలో తింటారు. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు ఉంటాయి. అయితే ఈ దీపావళికి సింపుల్‌గా మసాలా మఖానా కూడా మీరు తయారు చేసుకోవచ్చు.  ముందుగా ఈ మఖానాకు కొద్దిగా నెయ్యి, ఉప్పు, పసుపు, కారం, చాట్‌ మసాలా వేసి టాస్‌ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎయిర్‌ ఫ్రైయర్‌ బాస్కెట్‌లో స్ప్రెడ్‌ చేసుకోవాలి.  160 డిగ్రీల వద్ద ఓ ఐదు నిమిషాలు ఎయిర్‌ ఫ్రై చేయాలి.ఆ తర్వాత  రెండు సార్లు బాస్కెట్‌ టాస్‌ చేస్తూ ఉండాలి. చల్లగా మారితే కాస్త మిరియాల పొడి కూడా వేసి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Festivals