SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కాకరకాయతో ఇన్ని ప్రయోజనాలున్నాయా..!! తెలిస్తే అసలు విడిచిపెట్టరు..!

Bitter Gourd Benefits: చేదు అని కాకరకాయను పక్కన పెడుతున్నారా.. ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు గాక విడిచిపెట్టారు. కాకరకాయ మన శరీరంలో మధుమేహాన్నిఅంటే షుగర్‌ను నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర నిల్వలను కంట్రోల్ లో పెడుతుంది. డయాబెటిక్ రోగులకు ఇది బెస్ట్ కూరగాయ అని డాక్టర్లు చెబుతున్న మాట.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 03, 2026, 05:24 AM IST | Updated: Nov 03, 2026, 05:25 AM IST
Image Credit: Bitter Guard Benefits (Source/AI)
Join

Kakara Kaya Best Vegetable for Health: కాకరకాయలో బలమైన హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ శరీరానికి తగినంత పోషకాలను అందిస్తుంది.బరువు తగ్గాలనుకునే వాళ్లు ఆహారంలో విధిగా కాకరకాయ తీసుకోవాలి. అంతేకాదు శరీరంలోని కొవ్వు నిల్వలను తగ్గించడంలో సహాయ పడుతుంది.

విటమిన్ ఎ, సి.. 
ఇందులో విటమిన్ ఎ, సి వలన జుట్టుతో పాటు చర్మానికి మేలు చేస్తుంది. అంతేకాదు చర్మ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. జుట్టు రాలడాన్నిచుండ్రను  నివారించడంలో ముందు వరుసలో ఉంటుంది.

రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది..

కాకరకాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ఇది వైరస్ లను  ఎదుర్కోవడంలో ఎక్కువగా తోడ్పడుతుంది. అంతేకాదు మన శరీరంలో  రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో సహాయ పడుతుంది.  

కాకరకాయ అజీర్ణం, అలెర్జీల నుండి రక్షణను అందిస్తుంది.కాకరకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన   రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మొత్తం రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.కాకరకాయలోని శక్తివంతమైన ఇన్‌ఫ్లమేటరీ, వాపును నొప్పిని తగ్గించడంతో పాటు రక్తస్రావం ఆపడంలో సహాయపడుతుంది.

శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది..

శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది: ఇది యాంటీ హిస్టామిన్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్ లక్షణాల కారణంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయ పడుతుంది.


Disclaimer: ఈ  కథనం పాఠకుల ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. అర్హత కలిగిన డాక్టర్లు అందించే సలహాలు, సూచనలు తీసుకొని మాత్రమే మేము చెప్పిన వాటిని పాటించండి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES