SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

హ్యాంగోవర్ క్షణాల్లో వదిలిపోవాలంటే ఇలా చేయండి!

Hangover Symptoms: మద్యం సేవించిన మరుసటి రోజు ఒంట్లో ఏదోలా ఉంటుంది. శక్తి క్షీణిస్తుంది.. తలపోటు.. వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. గొంతు పిడచగట్టుకుపోతుంది.. కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంది. ఇలాంటి ఇబ్బందులు మీలో కూడా ఉంటే దీనిని హ్యాంగోవర్ అంటారు.

Written By Bhoomi
Published: Oct 21, 2026, 10:23 AM IST | Updated: Oct 21, 2026, 10:24 AM IST
Image Credit: Hangover Symptoms:
Join

Hangover Symptoms: మద్యం సేవించిన మరుసటి రోజు ఒంట్లో ఏదోలా ఉంటుంది. శక్తి క్షీణిస్తుంది.. తలపోటు.. వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. గొంతు పిడచగట్టుకుపోతుంది.. కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంది. ఇలాంటి ఇబ్బందులు మీలో కూడా ఉంటే దీనిని హ్యాంగోవర్ అంటారు. ఆల్కాహాల్ ఎఫెక్ట్ తో శరీరంలో నీటిశాతం, ఎలక్ట్రోలైట్లు లోపించి.. సరిగ్గా నిద్ర పట్టకపోవడం.. జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పెట్టడం వంటివి ఈ సమస్యలకు ప్రధాన కారణాలని చెప్పాలి. ఈ సమయంలో ఒంటికి సరైన రెస్ట్ ను ఇస్తూ.. నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి.

కొబ్బరి నీళ్లు లేదా మెడికల్ షాపుల్లో లభించే ఓఆర్ఎస్ ద్రావణం తీసుకుంటే.. కోల్పోయిన మినరల్స్, ద్రవాలు మళ్లీ శరీరానికి అందుతాయి. అయితే కేవలం నీళ్లు తాగినంత మాత్రాన, హ్యాంగోవర్ ఇట్టే మాయం అయిపోదని గమనించాలి. సమస్య తీవ్రతను బట్టి శరీరం కుదుటపడేందుకు  కొంత సమయం పడుతుంది.

అయితే హ్యాంగోవర్ తో బాధపడుతున్నప్పుడు కడుపుపై భారం పడకుండా తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని కొద్దికొద్దిగా తీసుకోవాలి. పెరుగన్నం.. అరటిపండ్లు, గుడ్లు..గంజి వంటి ఆహారాలు శరీరానికి పోషకాలను అందిస్తాయి. వికారం ఉంటే ఒకేసారి ఎక్కువగా తినకూడదు. తమకు అనుకూలంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. అలాగే తగినంత నిద్ర, రెస్ట్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

హ్యాంగోవర్ తగ్గించుకునేందుకు మళ్లీ ఆల్కాహాల్ తాగడం.. అధికంగా కాఫీ తీసుకోవడం లేదా వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం అస్సలు మంచిది కాదు.  మరీ ముఖ్యంగా  స్పృహ తగ్గడం.. గందరగోళం ఉన్నట్లు అనిపించడం.. పదే పదే వాంతులు చేసుకోవడం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులు సంప్రదించడం మంచిది. హ్యాంగోవర్ ను నివారించేందుకు ఆల్కాహాల్ మానేయడం అత్యంత సురక్షితమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES