• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /కరివేపాకు రైస్ ఇలా చేస్తే అదిరిపోయే రుచి.. ఘుమఘుమలాడేలా ఇంట్లోనే తయారు చేసుకోండి..!!

కరివేపాకు రైస్ ఇలా చేస్తే అదిరిపోయే రుచి.. ఘుమఘుమలాడేలా ఇంట్లోనే తయారు చేసుకోండి..!!

Karivepaku Rice Recipe: రోజూ ఒకే రకమైన అన్నం తిని బోర్ కొడుతోందా? అయితే ఒకసారి కరివేపాకు రైస్ ప్రయత్నించండి.

Written ByBhoomi
Published: Nov 20, 2026, 15:43 IST|Updated: Nov 20, 2026, 15:44 IST
joinshare
కరివేపాకు రైస్ ఇలా చేస్తే అదిరిపోయే రుచి.. ఘుమఘుమలాడేలా ఇంట్లోనే తయారు చేసుకోండి..!!
Image Credit: Karivepaku Rice Recipe

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Karivepaku Rice Recipe: రోజూ ఒకే రకమైన అన్నం తిని బోర్ కొడుతోందా? అయితే ఒకసారి కరివేపాకు రైస్ ప్రయత్నించండి. కరివేపాకును ప్రత్యేకంగా మసాలాలతో వేయించి పేస్ట్‌లా తయారు చేసి అన్నంలో కలిపితే అద్భుతమైన రుచి వస్తుంది. కరివేపాకు సువాసన, చింతపండు పులుపు, పచ్చిమిర్చి కారం కలిపి ఈ వంటకాన్ని ఎంతో రుచికరంగా మార్చేస్తాయి. మరి ఈ కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

అన్నం – 3 కప్పులు

కరివేపాకు – 2 కప్పులు

పచ్చిమిర్చి – 4

ఎండుమిర్చి – 3

చింతపండు – చిన్న నిమ్మకాయంత

పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు

మినప్పప్పు – 1 టీస్పూన్

శనగపప్పు – 1 టీస్పూన్

ధనియాలు – 1 టీస్పూన్

జీలకర్ర – అర టీస్పూన్

నువ్వులు – 1 టీస్పూన్

వెల్లుల్లి – 4 రెబ్బలు

పసుపు, ఉప్పు – తగినంత

నూనె – 3 టేబుల్ స్పూన్లు

ఆవాలు, ఇంగువ – కొద్దిగా

తయారుచేసే విధానం:

ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి నీరు లేకుండా ఆరబెట్టుకోవాలి. ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు వేసి కొద్దిసేపు వేయించాలి. చివరగా కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి చిక్కటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు బాణలిలో నూనె వేసి ఆవాలు, పల్లీలు, ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసి ముందుగా తయారు చేసుకున్న కరివేపాకు పేస్ట్‌ను అందులో వేయాలి. పచ్చివాసన పూర్తిగా పోయి నూనె పైకి తేలే వరకు తక్కువ మంటపై ఉడికించాలి. ఇప్పుడు ముందుగా వండుకుని చల్లార్చిన అన్నాన్ని వేసి మసాలా పేస్ట్ ప్రతి మెతుకుకు పట్టేలా మెల్లగా కలపాలి. అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసి రెండు నిమిషాలు సన్నని మంటపై ఉంచాలి.

అంతే.. ఎంతో రుచికరమైన కరివేపాకు రైస్ సిద్ధం. చివరగా కొద్దిగా నెయ్యి వేసి కలిపితే రుచి మరింత పెరుగుతుంది. కరివేపాకు పేస్ట్‌ను మరీ పలుచగా చేయకుండా చిక్కగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే అన్నం పొడిపొడిగా ఉండేలా ముందుగానే వండుకోవాలి. వేడి వేడి కరివేపాకు రైస్‌ను పెరుగు, అప్పడాలు లేదా పచ్చడితో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. 

Also Read: 

 

సొంత ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. 'పిచ్చికుక్కలు కరిచాయా?' అంటూ ఘాటు వ్యాఖ్యలు!

 

మీ కూతురి భవిష్యత్తుకు బంగారు బాట.. నెలకు రూ.12,500 పొదుపుతో చేతికి రూ.70 లక్షలు..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Health